ఎన్పీడీసీఎల్లో 100 క్లర్కు పోస్టుల భర్తీ
వరంగల్ నగర కేంద్రంగా 18 జిల్లాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థను నిర్వహించే నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్)లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదలైంది.
- ఈ నెల 10 నుంచి 29 వరకు దరఖాస్తుల స్వీకరణ
వరంగల్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్ నగర కేంద్రంగా 18 జిల్లాల్లో విద్యుత్తు సరఫరా వ్యవస్థను నిర్వహించే నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్)లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 29తో దరఖాస్తు గడువు ముగుస్తుందని ఎన్పీడీసీఎల్ పేర్కొన్నది. మే 22 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, మే 28న పరీక్ష ఉంటుందని తెలిపింది. 2023 జనవరి 1 వరకు 18 ఏండ్లు నిండిన వారు ఈ పోస్టులకు అర్హులు. గరిష్ఠ వయోపరిమితి 44 ఏండ్లుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు ఐదేండ్లు, దివ్యాంగులకు 10 ఏండ్ల మినహాయింపు ఉన్నది.
బీఏ, బీకాం, బీఎస్సీ పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న సంస్థలో కంప్యూటర్ అప్లికేషన్ లేదా ఆఫీసు ఆటోమేషన్ సర్టిఫికెట్ ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నది. కంప్యూటర్ ఒక సబ్జెక్టుతో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రత్యేకంగా సర్టిఫికెట్ అవసరం ఉండదని తెలిపింది. వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎన్పీడీసీఎల్ విద్యుత్తు సరఫరా వ్యవస్థను నిర్వహిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

