14,400 ఖాతాల్లో దళితబంధు డబ్బులు

- నేటి నుంచి హుజూరాబాద్‌లో రీ సర్వే
- దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం అమలు
- కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడి
కరీంనగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు సర్వే విజయవంతంగా పూర్తి చేశామని, ఇప్పటివరకు 14,400 మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్టు కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. బుధవారం నుంచి అధికారులు రీ సర్వే చేస్తారని, దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం అమలవుతుందని చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లో క్లస్టర్ అధికారులు, ప్రత్యేక అధికారులతో దళిత బంధుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రీ సర్వేలో రేషన్‌కార్డులు లేని వారి వివరాలు, వలస వెళ్లిన వారి వివరాలను కూడా నమోదు చేసుకొని యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. రీసర్వేలో భాగంగా బ్యాంకర్లను కూడా వెంట తీసుకెళ్లి కొత్తగా గుర్తించిన వారికి కూడా ఖాతాలు తెరిపించాలని సూచించారు. మొదటిసారి సర్వే చేసినప్పుడు ఇంటికి తాళం వేసి ఉంటే రీ సర్వేలో వారిని గుర్తించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఖాతాలో డబ్బులు జమ కాగానే సెల్ఫోన్లకు సంక్షిప్త సమాచారం వస్తుందని, దీన్ని అధికారులు ధ్రువీకరించుకోవాలని సూచించారు. దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం అమలు చేయడంతోపాటు ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

