విద్యార్థిని మృతదేహానికి రీ-పోస్టుమార్టం
నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎనిమిదో తరగతి విద్యార్థిని సాయిలిఖిత(14) మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవడంతో, ఆదిలాబాద్ జిల్లా తాంసి శ్మశానవాటికలో తహసీల్దార్ లక్ష్మి, మెండోర ఎస్సై సుహాసిని సమక్షంలో మంగళవారం డాక్టర్ అంకిత్రావు శవ పంచనామా చేసి నమూనాలను పరీక్షలకు పంపారు.
- అధికారుల నిర్లక్ష్యంపై అనుమానాలు
- కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించడంతో కదలిక
- హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణం : బాలిక తండ్రి
తాంసి, మార్చి 24 : నిజామాబాద్ జిల్లా పోచంపాడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎనిమిదో తరగతి విద్యార్థిని సాయిలిఖిత(14) మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. మూడు నెలల క్రితం జరిగిన ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవడంతో, ఆదిలాబాద్ జిల్లా తాంసి శ్మశానవాటికలో తహసీల్దార్ లక్ష్మి, మెండోర ఎస్సై సుహాసిని సమక్షంలో మంగళవారం డాక్టర్ అంకిత్రావు శవ పంచనామా చేసి నమూనాలను పరీక్షలకు పంపారు. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించడంతో యంత్రాంగం స్పందించి ఎఫ్ఐఆర్, రీ-పోస్టుమార్టం చేపట్టడం గమనార్హం.
మొదట కేసు నమోదు చేయని పోలీసులు
నిరుడు డిసెంబర్ 6న జ్వరంతో అస్వస్థతకు గురైన సాయిలిఖితకు సిబ్బంది స్థానికంగా చికిత్స అందించి, ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అకడ చికిత్స పొందుతూ డిసెంబర్ 17న మృతిచెందింది. కుటుంబసభ్యులు మొదట ఫిర్యాదు చేసినా కేసు నమోదుచేయలేదు. నిజామాబాద్ సీపీని ఆశ్రయించడంతో సోమవారం కేసు నమోదైంది. ఈ పరిణామాల మధ్య మృతదేహాన్ని వెలికితీసి రీ-పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు. కాగా హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన కూ తురు చనిపోయిందని, దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సాయి లిఖిత తండ్రి లింగన్న కోరారు. ఇదే కేసుతో సంబంధం ఉన్న ఏఎన్ఎం మరణం కూడా అనుమానాస్పదంగా ఉన్నదని విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

