BIE | ఇంటర్ విద్యలోనూ రేషనలైజేషన్!
BIE | ప్రభుత్వ బడుల తరహాలో ఇంటర్ విద్యలోను రేషనలైజేషన్‌ను చేపట్టేందుకు అధికారు లు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, అధ్యాపకుల సంఖ్య అధికంగా ఉంటే వారిని బదిలీచేసి, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న కాలేజీల్లో సర్దుబాటు చేయాలనుకొంటున్నారు. ఈ ఏడాది

అధ్యాపకులను సర్దుబాటు చేసేందుకు కసరత్తు
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల తరహాలో ఇంటర్ విద్యలోను రేషనలైజేషన్‌ను చేపట్టేందుకు అధికారు లు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, అధ్యాపకుల సంఖ్య అధికంగా ఉంటే వారిని బదిలీచేసి, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న కాలేజీల్లో సర్దుబాటు చేయాలనుకొంటున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయి. 10కిపైగా కాలేజీల్లో వెయ్యి మందికిపైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందగా, 30కిపైగా కాలేజీల్లో 500 మందికిపైగా చేరారు. ప్రస్తుతం వీరికి ఆన్లైన్ తరగతు లు నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తే, అధ్యాపకుల కొరత సమస్య తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో రేషనలైజేషన్ ప్రతిపాదనలను వారం రోజుల్లో ప్రభుత్వానికి పంపి, అనుమతి వచ్చిన వెంటనే హేతుబద్ధీకరణ చేపట్టనున్నారు. రాష్ట్రంలో 405 ప్రభుత్వ కాలేజీలున్నాయి. వీటి లో మొత్తం 6,008 పోస్టులుండగా, ప్రస్తుతానికి 817 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 3,599 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. 1,592 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల పలువురు అధ్యాపకులకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పించడంతో మరో 120 వరకు ఖాళీలు ఏర్పడ్డాయి. హేతుబద్ధీకరణ ద్వారా ఈ ఖాళీలను భర్తీచేయాలనుకుంటున్నారు.
కోర్సులు, సబ్జెక్టులను బట్టే కేటాయింపులు
ఇంటర్ కాలేజీల్లో ఒక్కో సెక్షన్‌కు గరిష్ఠంగా 88 మంది విద్యార్థులుండాలి. ఈ సంఖ్యను బట్టే అధ్యాపక పోస్టులను కేటాయించే అవకాశాలున్నాయి. కోర్సులు, సబ్జెక్టులను బట్టి అధ్యాపకులను కేటాయిస్తారు. ఉదాహరణకు ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీలను బోధించే అధ్యాపకులే బైపీసీ విద్యార్థులకు ఆయా సబ్జెక్టులను బోధించాల్సి ఉంటుంది. సీఈసీ విద్యార్థులకు ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులను బోధించే అధ్యాపకులే హెచ్ఈసీ విద్యార్థులకు ఆ సబ్జెక్టులను బోధించాలి. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ లాంటి భాషలను బోధించే అధ్యాపకులు అన్ని రకాల కోర్సుల్లోని వారికి బోధించాల్సి ఉంటుంది.
బదిలీలు చేపట్టాలి
ఇంటర్ అధ్యాపకుల బదిలీలను చాలా ఏండ్ల నుంచి చేపట్టలేదు. ఒకేచోట ఐదేండ్లకు మించి పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీచేయాలి. కానీ గత 13 సంవత్సరాల నుంచి అలాంటిదేమీ జరగలేదు. అధికారులు వెంటనే ఈ అంశంపై దృష్టి సారించి కాంట్రాక్ట్, రెగ్యులర్ అధ్యాపకులను బదిలీ చేయాలి. అలాగైతేనే సంఖ్య అధికంగా ఉన్న కాలేజీల్లోని విద్యార్థులకు న్యాయం చేయగలుగుతాం. – మాచెర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

