రామోజీకి కడసారి వీడ్కోలు
బహుముఖ ప్రజ్ఞాశాలి, అక్షర సేనాని, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు అశేష ప్రజానీకం అశ్రునయనాలతో అంతిమవీడ్కోలు పలికింది. ఆదివారం రామోజీ ఫిలింసిటీలోని స్మృతివనంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
- అశ్రునయనాలతో రామోజీరావు అంతిమయాత్ర
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
- ఫిలింసిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు
- రాజకీయ, సినీరంగాల ప్రముఖులు, అభిమానుల నివాళి
రంగారెడ్డి, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : బహుముఖ ప్రజ్ఞాశాలి, అక్షర సేనాని, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు అశేష ప్రజానీకం అశ్రునయనాలతో అంతిమవీడ్కోలు పలికింది. ఆదివారం రామోజీ ఫిలింసిటీలోని స్మృతివనంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. శనివారమంతా ప్రజల సందర్శనార్థం రామోజీ ఫిలింసిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఉంచిన రామోజీరావు భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం ఫిలింసిటీలోని ఆయన నివాసానికి తరలించారు. కడసారి చూసేందుకు రాజకీయ, సినీ, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కన్నీటి నివాళులర్పించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. రామోజీ పార్థీవదేహాన్ని వైకుంఠరథంపైకి చేర్చే సందర్భంలో కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. రథంపై రామోజీ కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, కోడళ్లు శైలజా కిరణ్, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి సోహాన, మనవడు సుజయ్, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి తదితరులు రథంపై ఉండి స్మృతివనానికి వచ్చారు. అశేష జనవాహిని వెంట రాగా అంతిమయాత్ర ఉదయం 11 గంటలకు స్మృతివనానికి చేరుకుంది.
ప్రముఖుల నివాళి
రామోజీరావు అంత్యక్రియలకు తెలుగు రాష్ర్టాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. స్మృతివనం వద్ద చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబునాయుడు రామోజీరావు పాడెను మోశారు. దహన సంస్కారాలు పూర్తయ్యేదాకా అక్కడే ఉన్నారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, బీజేపీ ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, మల్రెడ్డి రంగారెడ్డి, వివిధ పార్టీల నాయకులు నామా నాగేశ్వర్రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నలమోతు భాస్కర్‌రావు, వీ హనుమంతరావు, మోత్కుపల్లి నర్సింహులు, దేవేందర్‌గౌడ్, మర్రి శశిధర్‌రెడ్డి, దేవినేని ఉమ, తీగల కృష్ణారెడ్డి, సినీరంగ ప్రముఖులు మురళీమోహన్, సురేశ్‌బాబు, బోయపాటి శ్రీను తదితరులున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

