హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. 11 బడ్జెట్లు ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. సహజంగా ఒక శాఖలో అధికారులు 2, 3 ఏండ్లు పనిచేస్తేనే గొప్ప. అందులోనూ ఆర్థికశాఖ అత్యం త క్లిష్టమైనది. ఒకసారి బడ్జెట్ రూపొందించడం, దానిని అమలు చేయడం సవాల్‌తో కూడుకొన్న అంశం. ఇటువంటి శాఖలో తొమ్మిదేండ్ల నుంచి ఆయన ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ11 బడ్జెట్లలో భాగస్వామి కావడం గొప్ప విషయం. 2014 ఫిబ్రవరిలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావును ఈ సందర్భంగా సోమవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు.