Rajashyamala yagam | సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ముగిసిన రాజశ్యామల యాగం
Rajashyamala yagam | ఎర్రవల్లిలోని కేసీఆర్(CM KCR) వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం(Rajshyamala yagam) ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది.
సిద్దిపేట : ఎర్రవల్లిలోని కేసీఆర్(CM KCR) వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం(Rajshyamala yagam) ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది.
తెలంగాణ ప్రజలందరినీ రాజశ్యామల అమ్మవారు అనుగ్రహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ యాగాన్ని నిర్వహించారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కంకణం కట్టుకున్న నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. సశాస్త్రీయంగా యాగాన్ని పూర్తి చేసామని స్పష్టం చేసారు. ఈ యాగంతో తెలంగాణలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అవుతుందని చెప్పారు. మహా పూర్ణాహుతి అనంతరం యాగంలో మంత్రించిన జలాలను కేసీఆర్ దంపతులపై చల్లారు. యాగ భస్మాన్ని కేసీఆర్ నుదుట దిద్దారు
వేదోక్తంగా మహా పూర్ణాహుతి
యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శుక్రవారం నర్తనకాళి అలంకరణలో దర్శనమిచ్చింది. వేకువజాము నుంచే రాజశ్యామల, సుబ్రహ్మణ్యేశ్వర మూల మంత్రాల హవనం ప్రారంభమైంది. పూర్ణాహుతి ముహూర్త సమయానికి నిర్దిష్ట సంఖ్యలో హవనాలను పూర్తి చేసారు. మహా పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులతో పాటు బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు.
పూర్ణాహుతిలో వినియోగించే పసుపు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సమక్షంలో కేసీఆర్ దంపతులు పూజలు చేసారు. అష్టదిక్పాలకులకు ఆర్గ్యం సమర్పించారు. అనంతరం పూర్ణాహుతి జరిపారు. కేసీఆర్ దంపతులు ధరించిన కంకణాలను విసర్జించడం ద్వారా యాగం పూర్తయింది.

సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదిస్తున్న స్వరూపానందేంద్ర స్వామి
అనంతరం స్వరూపానందేంద్ర స్వామికి పాదపూజ చేసి కేసీఆర్ పుష్పాభిషేకంతో గురు వందనం సమర్పించారు. ఈ సందర్భంగా శూలినీ దుర్గ కవచంతో అభిమంత్రించిన రక్షను స్వరూపానందేంద్ర స్వామి కేసీఆర్‌కు కట్టారు. అలాగే విశాఖ శ్రీ శారదాపీఠం నుండి ప్రత్యేకంగా రప్పించిన రాజశ్యామల అమ్మవారి శేష వస్త్రాలను స్వరూపానందేంద్ర స్వామి కేసీఆర్ దంపతులకు అందించారు. శుభానికి సూచికగా పండితులంతా పసుపు వస్త్రాలను ధరించి యాగానికి హాజరయ్యారు.


రాజశ్యామల యాగం నిర్వహిస్తున్న వేదపండితులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
4 Militants Killed | మణిపూర్‌లో ప్రత్యర్థి నాగా వర్గాల మధ్య కాల్పులు.. నలుగురు మిలిటెంట్లు మృతి
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

