‘రాజధాని ఫైల్స్’సినిమా ప్రదర్శనకు బ్రేక్
రాజధాని ఫైల్స్ సినిమాపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. సినిమాకు సంబంధించి పూర్తి రికార్డులను తమకు అందించాలని స్పష్టం చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాజధాని ఫైల్స్ సినిమాపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. సినిమాకు సంబంధించి పూర్తి రికార్డులను తమకు అందించాలని స్పష్టం చేసింది. రాజధాని ఫైల్స్ సినిమా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నాని సహా మరికొన్ని పాత్రలను అనుచితంగా చిత్రీకరించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సినిమా విడుదలను ఆపేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు శుక్రవారం వరకు సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నేపథ్యంలో రాజధాని ఫైల్స్ చిత్రాన్ని భానుప్రకాశ్ తెరకెక్కించగా, కంఠంనేని రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రంలో వినోద్‌కుమార్, వాణీ విశ్వనాథ్ నటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

