Vaibhav Gehlot | ఈడీ విచారణకు హాజరైన రాజస్థాన్ సీఎం గెహ్లాట్ కుమారుడు వైభవ్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ ఈడీ విచారణకు హాజరయ్యారు. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి వైభవ్‌కు ఈ నెల 26న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: రాజస్థాన్ (Rajasthan) ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) కుమారుడు వైభవ్ గెహ్లాట్ (Vaibhav Gehlot) ఈడీ విచారణకు హాజరయ్యారు. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న (Foreign Exchange Rules ) ఆరోపణలకు సంబంధించి వైభవ్‌కు ఈ నెల 26న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు.
కాగా, రాజస్థాన్‌కు చెందిన హాస్పిటాలిటీ గ్రూప్ ట్రైటన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వర్ధన్ ఎంటర్ప్రైజెస్ సంస్థలు 2007-2008 సంవత్సరంలో మారిషెస్ నుంచి అక్రమంగా పెట్టుబడులు వచ్చాయన్న ఆరోపణలపై వైభవ్‌కు ఈడీ తాఖీదులిచ్చింది. ఆయనతోపాటు ఆ రెండు సంస్థల డైరెక్టర్లు అయిన శివ్ శంకర్ శర్మ, రతన్‌కాంత్ శర్మకు కూడా నోటీసులిచ్చింది. రతన్కాంత్తో ఉన్న సంబంధాలపై వైభవ్‌ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

