రాష్ట్రంలో పశ్చిమ గాలులు
- మూడ్రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతం పరిసరప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోని ఒకటి రెండుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ధరిలో 4.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం వాంకులంలో 4.75 సెంటీమీటర్లు, ఆదిలాబాద్ పట్టణంలో 3.53 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు, హైదరాబాద్‌లో అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి. రాబోవు రెండు, మూడ్రోజులు ఇదే వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Rain Alart
- Rains
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

