భానుడి చుట్టూ ఇంద్రధనస్సు

- రాష్ట్రంలో కనువిందు.. సోషల్‌మీడియాలో వైరల్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): సూర్యుని చుట్టూ ఇంద్రధనుస్సులా ఓ వలయం (వరద గుడి) ఏర్పడిన అద్భుత దృశ్యం బుధవారం రాష్ట్రంలో పలుజిల్లాల్లో కొన్ని గంటలపాటు కనువిందు చేసింది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపించింది. మంగళవారం రాత్రంతా ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురిసింది. వర్షం కారణంగా వాతావరణంలో నీటి బిందువులు ఉంటాయని, అవి స్ఫటికాలుగా మారినప్పుడు వాటి గుండా సూర్యుడి కాంతి ప్రసరించినప్పుడు విక్షేపం చెంది ఇంద్రధనస్సులా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా ఏర్పడిన వలయాలను సన్‌హాలో, 22 డిగ్రీ హాలోస్ అని పిలుస్తారు. కొన్ని సమయాల్లో ఇది 46 డిగ్రీల వ్యత్యాసాన్ని కలిగి ఉన్నప్పుడు మరోరకమైన ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది. సూర్యుని కాంతి షట్కోణ ఆకారంలో గల ఘనీభవించిన నీటి స్ఫటికాలపైపడి వక్రీభవనం చెందినప్పుడు కూడా రంగురంగులతో కూడిన వలయాలు ఏర్పడుతుండటం సహజమని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. ఈ అద్భుతాన్ని నగరవాసులు సెల్ఫోన్లనో బంధించి సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో ఈ చిత్రాలు ట్రెండింగ్‌లో నిలిచాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

