Mahabubabad | జలదిగ్బంధంలో మహబూబాబాద్.. కేసముద్రంలో ధ్వంసమైన రైల్వే ట్రాక్
భారీ వర్షాలతో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా జలదిగ్బంధం అయింది. జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ బందయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం వైపు రవాణా సౌకర్యం నిలిచిపోయాయి.
మహబూబాబాద్: భారీ వర్షాలతో మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా జలదిగ్బంధం అయింది. జిల్లా కేంద్రం నుంచి బయటకు వెళ్లే దారులన్నీ బందయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఇల్లందు, నెల్లికుదురు, కేసముద్రం వైపు రవాణా సౌకర్యం నిలిచిపోయాయి. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ఇంటికన్నె మధ్య ఎగువ, దిగువ మార్గాల్లో రైల్వేట్రాక్ కింద కంకర కొట్టుకోయింది. దీంతో మట్టి కోతకు గురవడంతో ట్రాక్ కింది నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో విజయవాడ- కాజీపేట మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్‌పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో పందిపల్లి వద్ద మహబూబ్‌నగర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ 4 గంటల పాటు నిలిచిపోయింది. మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో మచిలీపట్నం, సింహపురి రైళ్లు నిలిచిపోయాయి.

మహబూబాబాద్ మండలం అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగిపోయింది. దీంతో వరి పంట మొత్తం నీటమునిగింది. నెల్లికుదురు మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు ఎగిపోవడంతో ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో రావిరాల గ్రామం పూర్తిగా నీటమునిగింది. ఇండ్లపైకి ఎక్కిన జనాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. తమను కాపాడాలంటూ బంధువులకు ఫోన్లు చేస్తున్నారు. సాగర్ అనే వ్యక్తి కుటుంబంతోపాటు, మరో మూడు కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నామని, సహాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ఇక రాజుల కొత్తపల్లి చెరువుకట్ట తెగడంతో నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. అదేవిధంగా నర్సింహులపేట మండలం జయపురం గ్రామంలో అన్నా స్వామి కుంట కట్ట తెగిపోవడంతో రోడ్డు కోతకు గురయింది. గూడూరు శివారులో పాకాల వాగు పొంగి ప్రవహిస్తున్నది. దీంతో గూడూరు, కేసముద్రం, నెక్కొండ, గార్ల, రాంపురం, మద్దివంచ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇక జిల్లాలో అత్యధికంగా ఇంగుర్తిలో 29.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దంతాలపల్లిలో 29.4 సెం.మీ., మరిపెడలో 29.1 సెం.మీ., తొర్రూరులో 25 సెం.మీ., చినగూడులో 28.5 సెం.మీ., మహబూబాబాద్‌లో 26.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

