బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు సాధిస్తాం
బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు సాధించేవరకూ తమ పోరాటం ఆగదని బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. అందులో భాగంగానే ఈ నెల 10న ఓబీసీ జాతీయ సెమినార్ నిర్వహించాలని ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపారు.
- ఓబీసీల జాతీయ సెమినార్ జరుపాలని 10న చలో ఢిల్లీ
- 78 ఏండ్లుగా బీసీలను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు రాష్ట్రంలో, దేశంలో భవిష్యత్తు కష్టమే..
- రాష్ర్టాన్ని పాలించే నైతిక హక్కు సీఎం రేవంత్‌రెడ్డికి లేదు
- బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య ఫైర్
రవీంద్రభారతి, నవంబర్ 30 : బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు సాధించేవరకూ తమ పోరాటం ఆగదని బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. అందులో భాగంగానే ఈ నెల 10న ఓబీసీ జాతీయ సెమినార్ నిర్వహించాలని ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ఆదివారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ అధ్యక్షతన జరిగిన బీసీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. 78 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూనే వస్తున్నదని, ఇక రాష్ట్రంలో, దేశంలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదని తేల్చిచెప్పారు. బీసీలను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి విజయం సాధించారని, బీసీలను నమ్మించి గొంతుకోశారని మండిపడ్డారు. తక్షణమే ఆ పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. లేకుంటే బీసీ ద్రోహులుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం తొలిసారిగా కేంద్రంలో కులగణన చేపడుతున్నదని, ఇది దేశ చరిత్రలో రికార్డు అని, 56 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, కులగణన ఊసే ఎత్తకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కులగణన తరువాత చట్టసభల్లో ఓబీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు, ప్రత్యేక మంత్రిత్వశాఖ, జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల పెంపు తదితర చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు.
దేశావ్యాప్తంగా భారత్ జోడోయాత్ర చేపట్టి.. ఓబీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణను పాలించే నైతికహక్కు లేదని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఢిల్లీలో జరిగే జాతీయ సెమినార్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ర్టాలకు చెందిన ఓబీసీ ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యావంతులు భారీగా తరలిరానున్నట్టు చెప్పారు. ఈ సెమినార్‌కు 8 మంది కేంద్ర మంత్రులు, పెద్దసంఖ్యలో పార్లమెంట్ సభ్యులు హాజరుకానున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్, మహిళా సంఘం నేతలు అనురాధాగౌడ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోదీరాందేవ్, రాజేందర్, లింగయ్యయాదవ్, భీమరాజు, పద్మ, శివకుమార్‌యాదవ్, రాజుగౌడ్, నిఖిల్, సుప్రజ, గణేశ్‌యాదవ్, బాలస్వామి, భవానీ, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

