ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేని సీఎం రేవంత్
అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన రేవంత్రెడ్డి.. ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్కృష్ణయ్య విమర్శించారు. శుక్రవారం ఫార్మసిస్టులు, పారామెడికల్, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.
- పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి : కృష్ణయ్య
ముషీరాబాద్, అక్టోబర్ 16 : అధికారంలోకి వచ్చేందుకు అనేక హామీలు ఇచ్చిన రేవంత్రెడ్డి.. ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్కృష్ణయ్య విమర్శించారు. శుక్రవారం ఫార్మసిస్టులు, పారామెడికల్, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు, ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖలో గత 20,30 ఏండ్లుగా పనిచేస్తున్న 1700 మందిని వెంటనే పర్మినెంట్ చేయాలని కోరారు. వైద్య ఉద్యోగుల సేవలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఔట్స్సోరింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, ఎన్హెచ్ఎం ఉద్యోగులందరిని స్టేట్ హెల్త్ సొసైటీ పరిధిలోకి తీసుకువచ్చి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
పీజీ మూల్యాంకనంపై ఆడిట్ నిర్వహించాలి
- టీ-జూనియర్ డాక్టర్ల డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): కాళోజీ హెల్త్ వర్సిటీ పీజీ పరీక్షల మూల్యాంకనం, రీవాల్యుయేషన్, ప్రాక్టికల్ మార్కులపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. థియరీ మూల్యాంకనం, ఫైనల్ కరెక్షన్ పూర్తయిన తర్వాత, ప్రాక్టికల్ మార్కులు వేసిన అనంతరం మార్కుల్లో గణనీయమైన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని టీ-జూడా ఆరోపించింది. సబ్జెక్టులవారీగా మార్కుల వ్యత్యాసాలను విశ్లేషించి, ఫెయిల్యూర్ రేటుకు కారణాలను సమీక్షించాలని డిమాండ్ చేసింది. అర్హులైన అభ్యర్థులకు రీకౌంటింగ్ సౌకర్యాన్ని అందించాలని కోరింది. పరీక్షల ప్రక్రియకు సంబంధించి అందిన ఫిర్యాదులపై తగిన విచారణ చేసి నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అర్హత మార్కులకు 4-5 మార్కుల స్వల్ప తేడాతో వెనుకబడిన అర్హులైన అభ్యర్థులకు అమలులో ఉన్న పరిమిత గ్రేస్ మార్కులు కల్పించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

