దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి | ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.

పెద్దకొత్తపల్లి/నాగర్కర్నూల్ : ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో, కోడేర్ మండలం నాగులపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఓ వైపు కరోనాపై పోరాడుతూనే మరో వైపు రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు. దళారుల బెడద అరికట్టేందుకు కొనుగోలు కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని బీరం హెచ్చరించారు.

ప్రజలు కూడా సహకరించాలని, పంట కోసి బాగా ఆరబెట్టిన తర్వాత వారికి ఇచ్చిన టోకెన్ నెంబర్ ప్రకారంగా కొనుగోలు కేంద్రాలకు రావాలని రైతులను కోరారు. కరోనా సెకండ్ వేవ్ పెరుగుతున్న కారణంగా రైతులందరూ మాస్క్ లు ధరించాలని, తప్పకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

