తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్న పంజాబ్.. ఆ రాష్ట్ర సీఎం నేతృత్వంలో సాగునీటి పథకాలపై అధ్యయనం
Cm Bhagwant Mann | తెలంగాణలో చేపట్టిన సాగునీటి పథకాలు బాగున్నాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రశంసించారు. రాష్ట్రంలోని భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది.
హైదరాబాద్ : తెలంగాణలో చేపట్టిన సాగునీటి పథకాలు బాగున్నాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రశంసించారు. రాష్ట్రంలోని భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు భగవంత్ సింగ్ నేతృత్వంలోని అధికారుల బృందం సిద్దిపేట జిల్లాలో పర్యటించింది. కొండపోచమ్మ సాగర్‌తో పాటు గజ్వేల్‌లోని పాండవుల చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్‌తో నీటిపారుదలశాఖ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, ప్రాజెక్టు నిర్మాణం తీరు, వివిధ దశలను వివరించారు.

అలాగే రాష్ట్రంలో చేపట్టిన జలవనరుల పథకాలను మ్యాప్‌లు, చార్జులతో వివరించారు. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం రాష్ట్రంలో చేపట్టిన చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలను పెంచేందుకు చేపట్టిన కార్యక్రమాలు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను ఇచ్చాయని చెప్పారు. పంజాబ్‌లో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయని, ఆయా కార్యక్రమాలను పంజాబ్‌లోనూ అమలు చేయనున్నట్లు వివరించారు.

పంజాబ్ సీఎంతో పాటు ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారుల బృందం రాష్ట్రంలోని మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్‌డ్యాంల నిర్మాణం, కాలువలు, చెరువులు, చిన్న నీటి వనరుల నిర్వహణ, ఫలితాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చర్యలతో తెలంగాణలో భూగర్భ జలాలు దాదాపు 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వ అధ్యయనాల్లో తేలింది. దీంతో పంజాబ్ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమాలు అమలు చేసేందుకు ఆ రాష్ట్ర అధికారులు భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

