Harish Rao | రాష్ట్రంలో ఐటీఐల పరిస్థితి అధ్వానం.. ప్రభుత్వంపై మాజీ మంత్రి ఫైర్
Harish Rao | రాష్ట్రంలో ఐటీఐ కాలేజీలు సహా గురుకులాలు సమస్యల వలయం లో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐటీఐ కాలేజీలు సహా గురుకులాలు సమస్యల వలయం లో కొట్టుమిట్టాడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. విద్యాలయాల్లో వసతులు క ల్పించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి, సంగారెడ్డి, ఆదిలాబాద్ సహా రాష్ట్రంలో ని ఐటీఐల పరిస్థితి అధ్వానంగా ఉన్నదని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని, సరిపడా టాయిలెట్స్ లేవని, అవసరమైన సిబ్బంది లేరని, విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. కంప్యూటర్లు ఇతర ఉపకరణాలు పనిచేయడం లేదని, దీంతో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయలేకపోతున్నారని తెలిపారు.
గురుకులాల పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదని, కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత, పాముకాటులతో విద్యార్థి మృతి, డెంగ్యూతో విద్యార్థి దుర్మరణం వంటి వార్తలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయని ఆందోళన చెందారు. అత్యధి క ప్రాంగణాలు దోమలు, ఈగలతో ము రికి కూపాలుగా మారాయని, స్నానాల గదులకు డోర్లు కూడా లేని దుస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని, పెడుతున్నది కూడా నాణ్యంగా లేదని, విధిలేక కారం మెతుకులతో కడుపునింపుకొంటున్నారని ఉదహరించారు.
సమస్యలు ఇలా ఉంటే విద్యార్థులు చదువుపై ఎలా దృష్టి పెడతారని, గురుకులాలకు తమ పిల్లాలను తల్లిదండ్రులు ఎలా పంపుతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో దిగజారుతుండటం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఐటీఐలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిషరించాలని డిమాండ్ చేశారు.
కోలుకుంటున్న
గురుకుల విద్యార్థిని కార్తీక
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి గాయాలపాలైన విద్యార్థిని కోలుకుంటున్నదని ప్రభుత్వం తెలిపింది. ములుగులోని తెలంగాణ సాం ఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని కార్తీక 9న సూల్ మూడో అంతస్థు నుంచి పడిపోయింది. దీంతో విద్యార్థిని నడుము భాగంలో గాయాలయ్యాయి. కార్తీకను వరంగల్ ఎంజీఎంకు, అకడి నుంచి నిమ్స్‌కు తరలించారు. విద్యార్థినికి ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నిమ్స్ న్యూరో సర్జన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం మంగళవారం కార్తీకకు ఆపరేషన్ నిర్వహించగా, ఐసీయూలో కోలుకుంటున్నది. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక కూడా కార్తీక ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారని అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

