ఆ 4 ఏండ్లు ఎక్కడ చదివితే అదే లోకల్
- పరిగణనలోకి 4 నుంచి 7వ తరగతులు
- టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో రాష్ట్రపతి ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): వరుస ఉద్యోగ ప్రకటనలతో అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. యువత భారీగా దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసేలా టీఎస్పీఎస్సీ అన్ని చర్యలు తీసుకొంటున్నది. కొత్త సమాచారాన్ని వెబ్సైట్లో పొందుపరుస్తున్నది. ప్రస్తుతం లోకల్ (స్థానికత)కు సంబంధించి అభ్యర్థుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. వాటన్నింటినీ నివృత్తి చేసేలా.. రాష్ట్రపతి ఉత్తర్వులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అసలు.. లోకల్ క్యాడర్‌గా ఎవరిని పరిగణిస్తారనే సమాచారం అందులో స్పష్టంగా ఉన్నది. జిల్లా పోస్టులకు (జూనియర్ అసిస్టెంట్ కిందిస్థాయి), జిల్లా, జోనల్ పోస్టులకు (సూపరింటెండెంట్), జోనల్, మల్టీజోనల్ పోస్టులకు (సూపరింటెండెంట్ పైస్థాయి) మల్టీజోనల్ లోకల్ ఏరియా పరిధిలోకి వస్తుంది. రాష్ట్రంలో 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీజోన్లు ఉన్నాయి. గతంలో ఉన్న రాష్ట్రస్థాయి పోస్టులు కూడా ఈసారి మల్టీజోనల్ పరిధిలోకే మారాయి.
ఆ నాలుగేండ్లే కీలకం..
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి పోటీపడే అభ్యర్థి 4 నుంచి 7వ తరగతి వరకు వరుసగా ఎక్కడ చదివితే అక్కడ స్థానికత వర్తిస్తుంది. 4 నుంచి 7వ తరగతి వరకు ఏ ఒక్క ఏడాది వేరే రాష్ట్రంలో చదివినా అతడిని నాన్ లోకల్ కింద పరిగణిస్తారు. అయితే.. 1 నుంచి 3వ తరగతి వరకు ఎక్కడ చదివినా దానిని పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థి తెలంగాణలోని రెండు, మూడు ఏరియాల్లో 1 నుంచి 7వ తరగతి వరకు చదివితే.. చివరి తరగతులు చదివిన ప్రాంతం లోకల్ ఏరియా అవుతుంది. అంటే.. 1 నుంచి 3 వరకు ఒక జిల్లాలో, 4, 5 మరో జిల్లాలో, 6, 7వ తరగతులు ఇంకో జిల్లాలో చదివితే.. చివరి రెండేండ్లు చదివిన జిల్లాలోనే స్థానికత లభిస్తుంది. 1 నుంచి 7వ తరగతి వరకు లేదా 4 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదవకుండా.. 8వ తగరతి నుంచి ఆపైన తెలంగాణలో చదివినా ఆ అభ్యర్థి నాన్ లోకల్ కిందే పరిగణిస్తారు. అంటే.. 4 నుంచి 7వ తరగతి వరకు ఆ నాలుగేండ్లు ఎక్కడ చదివితే అదే ఆ అభ్యర్థి స్థానికత అవుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

