26న రాష్ర్టానికి రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న రాష్ర్టానికి రానున్నారు. ఐదురోజులపాటు సాగే పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
- 28న రామప్ప, భద్రాచలం సందర్శన
- ప్రసాద్ పథకానికి శ్రీకారం
- మొత్తం ఐదురోజుల పర్యటన
హైదరాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ)/వెంకటాపూర్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న రాష్ర్టానికి రానున్నారు. ఐదురోజులపాటు సాగే పర్యటనలో భాగంగా ఆమె వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నెల 28న భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంతోపాటు ములుగు జిల్లా రామప్ప రుద్రేశ్వర ఆలయాన్ని సందర్శించి, ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ కృషితో రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంలో రాష్ట్రపతి రామప్పను సందర్శించడం ఇదే ప్రథమం. రామప్ప ఆలయ ప్రాంగణంలో ఆమె ప్రసాద్ పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు.
రాష్ట్రపతి పర్యటన వివరాలు
ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ వెంటనే బొల్లారంలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి, వీరనారీమణులను సత్కరిస్తారు. రాత్రి 7.45కి రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇచ్చే విందుకు హాజరవుతారు.
27న నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో రాష్ట్రపతి సమావేశమవుతారు. మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతోపాటు భూటాన్, నేపాల్, మాల్దీవులు తదితర దేశాల అధికారులతోనూ సమావేశమవుతారు.
28న తొలుత భద్రాచలం, ఆ తరువాత రామప్ప ఆలయాలను సందర్శించి ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు. అదేరోజు మిశ్ర ధాతు నిగం లిమిటెడ్(మిథాని)కి సంబంధించిన వైడ్ప్లేట్ మిల్ ప్లాంట్‌ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు.
29న ఉదయం షేక్‌పేటలోని జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాలను సందర్శించి, విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమవుతారు. సాయంత్రం శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో శ్రీరామానుజాచార్య (సమతామూర్తి) విగ్రహాన్ని సందర్శిస్తారు.
30న రంగారెడ్డి జిల్లాలోని కన్హ శాంతివనంలో శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాంస్కృతికశాఖ, శ్రీరామచంద్రమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి విందు ఇస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

