ప్రజాపాలనలో రైతులు ఆగమాగం
కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతులు ఆగమాగమవుతున్నారని, వారిని ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు.
- విద్యుత్తు, ఎరువుల కొరతతో అవస్థలు
- రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం
- బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
కొందుర్గు, అక్టోబర్ 12 : కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతులు ఆగమాగమవుతున్నారని, వారిని ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్‌తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, ఎరువుల కొరత, విద్యుత్తు కోతల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, సర్పంచులు ప్రభాకర్, మోహనచారి, సోనిశేఖర్, మాజీ జడ్పీటీసీ రాములు, నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

