డిస్కమ్‌లను ప్రైవేటీకరించొద్దు.. డిప్యూటీ సీఎం ఎదుట పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆందోళన
రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కమ్)లను ప్రైవేటీకరిస్తారనే ప్రచారం జరుగుతున్నదని పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్‌రావు నేతృత్వంలో జేఏసీ నేతలు డిప్యూటీ సీఎంతో ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు.
హైదరాబాద్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కమ్)లను ప్రైవేటీకరిస్తారనే ప్రచారం జరుగుతున్నదని పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్‌రావు నేతృత్వంలో జేఏసీ నేతలు డిప్యూటీ సీఎంతో ప్రజాభవన్‌లో భేటీ అయ్యారు. రైతు డిస్కమ్ ఏర్పాటు ఉద్యోగుల సర్దుబాటు, 2026 పీఆర్సీ, 2004కి ముందు నియమితులైన వారికి పాత పింఛన్, రెగ్యులర్ ప్రమోషన్లు, కొత్త నియామకాలు, ఆర్టిజన్ సమస్యలపై జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ తాము ఎట్టి పరిస్థితుల్లో డిస్కమ్‌లను ప్రైవేటీకరించబోమని స్పష్టం చేశారు. విద్యుత్తు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని, ఉద్యోగ సంఘాలకు ప్రతి నెలా గంట పాటు సమయం కేటాయించేలా అధికారులను ఆదేశిస్తామని భట్టి హామీనిచ్చారు. జేఏసీ కో కన్వీనర్ బీసీరెడ్డి, నాయకులు భూపాల్‌రెడ్డి, సదానందం, శివశంకర్, స్వామి, రమేశ్, అశోక్, సుధాకర్‌రెడ్డి, నాగరాజు, సత్యనారాయణ, దయానంద్, జనప్రియ, మల్లయ్య, ప్రమోద్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

