ఒకేరోజు ఎంసెట్, సీయూఈటీ
- మెయిల్ ద్వారా ఎంసెట్ తేదీలు మార్చుకొనే అవకాశం
హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ఎంసెట్ విద్యార్థులకు కొత్త సమస్య తలెత్తింది. ఒకే రోజు ఎంసెట్‌తోపాటు సెంట్రల్ కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) కూడా ఉండటంతో రెండింటికి హాజరయ్యేవారు ఏదో ఒకటి కోల్పోవాల్సి వస్తున్నది. టీఎస్ ఎంసెట్ జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో జరుగనున్నది. సెంట్రల్ వర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీని కూడా జూలై 15, 16, 19, 20 తేదీలతోపాటు, ఆగస్టు 4 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. జూలై 15, 19, 20 తేదీల్లో రెండు పరీక్షలు ఉంటాయి. ఈ విషయాన్ని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ దృష్టికి ‘నమస్తే తెలంగాణ’ తీసుకెళ్లగా.. సీయూఈటీ కారణంగా ఎంసెట్‌ను వాయిదా వేయబోమని చెప్పారు. రెండింటికి హాజరయ్యే వారుంటే మరో రోజు పరీక్ష రాసుకొనే అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇలాంటి వారు.. convener.eamcet@tsche.ac.in కు మెయిల్ చేయాలని సూచించారు. టీఎస్ ఎంసెట్‌కు 2,65,547 దరఖాస్తులు వచ్చాయి. ఇంజినీరింగ్‌కు 1,71,500, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌కు 94,047 దరఖాస్తులు వచ్చాయి. రూ.2,500 ఆలస్య రుసుముతో ఈ నెల 27 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో జూలై 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్‌టికెట్ల డౌన్లోడింగ్ శనివారం నుంచి ప్రారంభమైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు రూ.1,800 కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

