Chiranjeevi Trust | తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు.. చిరంజీవి ట్రస్ట్, స్టార్ హాస్పిటల్ నిర్వహణ
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పిటల్ సంయుక్తాధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహించనున్నట్టు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వెల్లడించారు.
- 9న తొలి శిబిరంలో వెయ్యి మందికి టెస్ట్‌లు
- ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వెల్లడి
Chiranjeevi Trust | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పిటల్ సంయుక్తాధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలను నిర్వహించనున్నట్టు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వెల్లడించారు. శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలివిడత జూలై 9న జూబ్లీహిల్స్‌లోని చారిటబుల్ ట్రస్ట్ క్యాంపస్‌లో దాదాపు 1,000 మందికి ముందస్తు ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయనున్నట్టు తెలిపారు. ఇందులో సినీ కార్మికులు, జర్నలిస్టులు, అభిమానులకు పరీక్షలు చేస్తారని వివరించారు. దశలవారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు.
క్యాన్సర్ బాధితుల్లో 40 శాతం మంది ఓరల్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, వారిలో ఎక్కువగా పొగాకు ఉత్పత్తులు, గుట్కాల వంటివి వినియోగించే వారుంటున్నారని తెలిపారు. బ్రెస్ట్, సర్వైకల్, లంగ్, పెద్దపేగు తదితర క్యాన్సర్లన్నింటికీ ప్రత్యేక క్యాంప్‌ల ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. స్టార్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మన్నం గోపిచంద్ మాట్లాడుతూ నాలుగు నెలల ప్రణాళికలో భాగంగా తొలి విడతగా హైదరాబాద్, కరీంనగర్, వైజాగ్‌లో స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తామని వివరించారు. ప్రతి క్యాంప్‌లో వెయ్యి మందికి తగ్గకుండా పరీక్షలు చేస్తామని, అయితే హైరిస్క్ గ్రూప్‌ను గుర్తించి వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. సమావేశంలో డాక్టర్ విపిన్ గోయల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

