Chepa Prasadam | చేప మందు పంపిణీ షురూ.. భారీగా తరలివచ్చిన ఆస్తమా రోగులు
ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిని సోదరులు ప్రతి ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం (Chepa Prasadam) పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
హైదరాబాద్: ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిని సోదరులు ప్రతి ఏటా ఉచితంగా సరఫరా చేసే చేప ప్రసాదం (Chepa Prasadam) పంపిణీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు చేప మందును పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. చేప ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. చేప ప్రసాదం కోసం వచ్చిన ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి 42 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. 13 కౌంటర్ల ద్వారా ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా పెట్టారు.

ఆది సోమవారాల్లో జరుగనున్న ఈ కార్యక్రమం కోసం.. ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నది. నగరం నలుమూలల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు 140 స్పెషల్ బస్సులను తిప్పుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి బస్సులను సిద్ధంగా ఉంచింది. ప్రయాణికుల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ రిసెప్షన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు శానిటేషన్ పనులను పర్యవేక్షిస్తుండగా, జల మండలి మంచినీటి సరఫరా చేస్తున్నది. ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ, సోమవారం ఉదయం 9 గంటల వరకు కొనసాగనుంది. దీనికోసం మత్స్య శాఖ లక్ష చేప పిల్లలను సిద్ధంగా ఉంచింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
MVSR College | హైదరాబాద్ ఎంవీఎస్ఆర్ కాలేజీ దుర్ఘటన.. విద్యార్థిని మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

