Conductor Pravalika | కండక్టర్ ప్రవళిక తల్లికి ఉద్యోగం.. రూ.10లక్షల పరిహారం ప్రకటించిన పొన్నం.. ప్రయాణికురాలిపై హత్య కేసు!
Conductor Pravalika | మణుగూరు ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక కుటుంబానికి మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
Conductor Pravalika | ప్రయాణికురాలు నెట్టివేయడంతో ఆర్టీసీ బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోయిన మణుగూరు ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ గుండ్ల ప్రవళిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇక ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం కారణంగా బ్యాంకు తరఫు నుంచి మరో రూ. కోటి వరకు ప్రమాద బీమా అందుతుందని వెల్లడించారు.
హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద ప్రవళిక పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. అనంతరం ఆమె తల్లిని పరామర్శించి కుటుంబానికి ప్రభుత్వం, ఆర్టీసీ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రవళిక తల్లికి ఉద్యోగం, కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక సాయం అందించడంతోపాటు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు.
మహిళా కండక్టర్ ప్రవళిక మృతికి కారణమైన ప్రయాణికురాలిపై హత్య కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటాం
ఆర్టీసీ సిబ్బంది పొరపాటు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి.. అంతే తప్ప చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు
ఓ ప్రయాణికురాలు తోసెయ్యడం వల్ల.. మహిళా కండక్టర్ ప్రవళిక మృతి చెంది ఓ కుటుంబం రోడ్డున పడింది
ప్రవళిక కుటుంబానికి రూ.1 కోటి నష్టపరిహారంత పాటు ఒక ఇందిరమ్మ ఇల్లు, ఆమె తల్లికి ఉద్యోగం ఇస్తాం
– మంత్రి పొన్నం ప్రభాకర్
— PulseNewsBreaking (@pulsenewsbreak) November 4, 2026
ప్రయాణికురాలిపై హత్య కేసు
ఆర్టీసీ సిబ్బంది విధి నిర్వహణలో పొరపాటు చేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, అంతేతప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పొన్నం ప్రభాకర్ సూచించారు. ఒక ప్రయాణికురాలు తోసేయడం వల్ల మహిళా కండక్టర్ ప్రాణాలు కోల్పోయి ఓ కుటుంబం రోడ్డున పడిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రవళిక మృతికి కారణమైన ప్రయాణికురాలిపై హత్య కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Conductor Pravalika | కండక్టర్ ప్రవళిక తల్లికి ఉద్యోగం.. రూ.10లక్షల పరిహారం ప్రకటించిన పొన్నం.. ప్రయాణికురాలిపై హత్య కేసు!
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

