Dial 100 | డయల్ 100కు పెరిగిన కాల్స్ తాకిడి.. ఐదు నిమిషాల్లో ఆపద్బాంధవులు
స్వరాష్ట్రంలో పోలీస్ విజుబులిటీ పెరిగింది. గ్రామాల్లో మినహా.. మండలం, పట్టణ కేంద్రాల నుంచి నగరాల వరకు ఎటు చూసినా పోలీసులు కనిపిస్తున్నారు.
- ఫోన్ వచ్చిన వెంటనే స్పాట్‌లోకి పోలీసులు
- తక్షణ స్పందన.. సత్వర న్యాయం..
Dial 100 | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో పోలీస్ విజుబులిటీ పెరిగింది. గ్రామాల్లో మినహా.. మండలం, పట్టణ కేంద్రాల నుంచి నగరాల వరకు ఎటు చూసినా పోలీసులు కనిపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేస్తే చాలు.. నిమిషాల వ్యవధిలోనే రెక్కలు కట్టుకొని వాలిపోతున్నారు. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు కల్పించిన అనువైన వాతావరణం, సిబ్బంది తక్షణమే స్పందిస్తుండటంతో ప్రజల్లో పోలీసు వ్యవస్థపై పూర్తిగా నమ్మకం పెరిగింది.
కాల్ చేస్తే పరిష్కరిస్తారనే నమ్మకం
సమస్య ఏదైనా డయల్ 100కు కాల్ చేస్తే పరిష్కరిస్తారనే నమ్మకం తెలంగాణ ప్రజల మెదళ్లలో నాటుకుపోయింది. సమస్య చిన్నదా? పెద్దదా? అసలు పరిష్కారం అవుతుందా? అవదా? అభ్యంతరకమైన సమస్యకు కూడా వారికి కాల్ చేయొచ్చా? లేదా? అనే ఆలోచన లేకుండా టక్కున 100కు కాల్ చేస్తున్నారు. డయల్ 100 సిబ్బంది కూడా సమస్య తీవ్రతను బట్టి వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు ఆ ఫిర్యాదును రిఫర్ చేస్తున్నారు. ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం కావటంతో.. కొందరు ఆకతాయిల బెడద కూడా ఎక్కువైంది. 2022లో డయల్ 100/112కు 13,77,113 కాల్స్ వచ్చాయి. అన్ని స్టేషన్ల రిసెప్షన్ల ద్వారా 5,58,524 ఫిర్యాదులు స్వీకరించారు. హ్యాక్ ఐ నుంచి 9,684 ఫిర్యాదులు తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా సోషల్ మీడియా నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం విదితమే. ఈక్రమంలో నిరుడు 1,16,431 పోస్టుల ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు.
స్పాట్‌కు ఐదారు నిమిషాల్లో
అత్యవసర సమయాల్లో బాధితులకు అండగా ఉండేందుకు పోలీసులు స్పందిస్తున్న తీరును యావత్ తెలంగాణ సమాజం కొనియాడుతున్నది. 2022లో డయల్ 100కు వచ్చిన 3.77 లక్షల కాల్స్‌కు కేవలం 7 నిమిషాల్లోనే పెట్రోలింగ్ కార్లు, బ్లూకోట్ వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తెలంగాణవ్యాప్తంగా వెయ్యికిపైగా పెట్రోలింగ్ కార్లు మూడు షిఫ్టుల్లో అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,088మందికి పైగా పెట్రోల్ కార్ ఆఫీసర్లు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 2,100కు పైగా బ్లూకోట్ వాహనాలు మూడు షిఫ్టుల్లో అందుబాటులో ఉండగా.. సుమారు 6,784 మందికిపైగా బ్లూకోట్ ఆఫీసర్లు నిరంతరం గస్తీ కాస్తున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో స్పాట్‌కు చేరుకునే సమయం కూడా ఐదారు నిమిషాలకు తగ్గింది.
మాట్లాడుతుండగానే.. స్పాట్‌లోకి పోలీసులు..
హలో డయల్ 100.. సార్ నా కూతురు ఇంట్లోకెళ్లి తలుపులు పెట్టుకున్నది. ఉరిపెట్టుకోబోతున్నది.. కాపాడండయ్యా..’ అంటూ మాట్లాడుతుండగానే.. అడ్రస్, లొకేషన్ ఆధారంగా స్థానిక పెట్రోలింగ్ వాహనం అప్రమత్తమైంది. కేవలం రెండు నిమిషాల్లో పోలీసులు రావటం, తలుపులు బద్దలుకొట్టటం, మహిళను కాపాడటం జరిగిపోయాయి. 2019 నుంచి 2020 వరకూ ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వస్తే.. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకోవటానికి పది నుంచి ఎనిమిది నిమిషాల సమయం పట్టేది. 2021లో ఆ సమయం ఏడు నిమిషాలకు తగ్గింది.. 2022 చివరి నాటికి 6 నిమిషాలకు వచ్చింది. ప్రస్తుతం సుమారు 5 నిమిషాల్లోపే పోలీసులు సంఘటనా స్థలంలో ప్రత్యక్షమవుతున్నారు.
1) పోలీస్ విజుబులిటీ/ అవుట్‌రీచ్ వివరాలు
- 2020 – 90.8%
- 2021 – 99.3%
- 2022 – 100%
2) అత్యవసర సమయాల్లో చేరుకున్న సమయం
- 2020 – 8 నిమిషాలు
- 2021 – 7 నిమిషాలు
- 2022 – 6 నిమిషాలు
3) ఫిర్యాదుల స్వీకరణ
- 2020 – 4,88,422
- 2021 – 5,62,675
- 2022 – 5,58,524
4) ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్
- 2020 – 1,35,537
- 2021 – 2,10,233
- 2022 – 2,16,875
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

