Firing | హైదరాబాద్‌లో మరోసారి కాల్పులు.. ఏం జరిగిందంటే?
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి కాల్పులు (Firing) కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి వేళ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి పోలీసు కాల్పుల (Firing) కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని అడ్డుకుని ప్రశ్నించారు. అయితే వారు సమాధానం చెప్పకపోవడంతో పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడికి యత్నించారు. మరొవ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. ఈ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపి దుండగులను పట్టుకున్నారు.
కాల్పుల్లో రాజు అనే వ్యక్తితోపాటు మరొకరికి గాయాలయ్యాయి. మరో ఇద్దరు దుండగులు తప్పించుకున్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. గాయపడినవారిని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఇటీవలే హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో పార్ధీ గ్యాంగ్ దొంగలను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఇక గత నెలలో సికింద్రాబాద్‌లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న దొంగల బైక్ టైరును కాల్చాలని ప్రయత్నించగా.. ఆ తూటా బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి కాలులోకి దూసుకెళ్లింది. అనంతరం ఇద్దరు స్నాచర్లను పట్టుకున్నారు. మరో ఘటనలో గత కొన్నిరోజులుగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్లపై సైదాబాద్ పోలీసులు కాల్పులు జరిపారు. వారిని అమీర్ గ్యాంగ్‌కు చెందిన దొంగలుగా గుర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

