Good News to Drunk& Drive people | ఆ వాహనాలు సీజ్ చేయొద్దు.. హైకోర్టు ఆదేశం!
Good News to Drunk& Drive people | డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తుల వాహనాలను సీజ్ చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Good News to Drunk& Drive people | ఆల్కాహాల్ సేవించి వాహనం నడపడం ప్రమాదకరం.. రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ఎవరైనా మద్యపానం చేయరాదు.. అయితే, అనునిత్యం రద్దీగా ఉండే ట్రాఫిక్ మధ్య వాహన చోదకులు స్పీడ్‌గా వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అదే మద్యం మత్తులో ఉంటే మరింత స్పీడ్‌గా వెళుతుంటారు.. అటువంటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ.. దీన్ని నివారించడానికి పోలీసు యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట వాహన చోదకులను నిలిపి వారు మద్యం సేవించారా.. లేదా.. అన్నది బ్రీత్ ఎనలైజర్ ద్వారా చెక్ చేస్తున్నారు. మద్యం తాగినట్లు తేలితే వెంటనే బైక్ సీజ్ చేస్తున్నారు. అయితే ఇకపై .. బైక్ సీజ్ చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మద్యం సేవించి వాహనం నడిపేవారిని అరెస్ట్ చేయొచ్చని తెలిపింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ విషయమై దాఖలైన 40 రిట్ పిటిషన్లపై విచారణ పూర్తి చేస్తూ జస్టిస్ కే ఎల్ లక్ష్మణ్ సారధ్యంలోని రాష్ట్ర హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
బంధువు.. స్నేహితుడికి సమాచారం ఇవ్వాలి..
మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడుపుతూ ఉంటే, ఆయనతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేసేందుకు పోలీసులు అనుమతించాలి.. లేదా వారి బంధువుకు గానీ, స్నేహితుడికి గానీ సమాచారం ఇచ్చి సదరు వాహనం తీసుకెళ్లమని సూచించాలని హైకోర్టు పేర్కొంది. ఈ మార్గదర్శకాలను అమలు చేసే అవకాశం లేనప్పుడు మాత్రమే పోలీసులు సంబంధిత వాహనాన్ని తాత్కాలికంగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని సూచించింది. అలా జప్తు చేసిన వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సమర్పించిన దాని యజమాని, లేదా అధీకృత వ్యక్తికి తదుపరి దాన్ని అప్పగించాల్సి ఉంటుంది.
3 రోజుల్లో చార్జిషీట్‌తో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలి
ఇక మద్యం సేవిస్తూ వాహనం డ్రైవ్ చేసిన వ్యక్తిని పోలీసులు మూడు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఆదేశించింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యలు చేపడతామని పోలీసులను హెచ్చరించింది. మోటార్ వెహికల్స్ యాక్ట్‌లో గానీ, ఇతర ప్రభుత్వ ఆదేశాల్లో గానీ.. ఒక వ్యక్తి వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి:
Mukesh Ambani @ London | లండన్‌లోనూ ముకేశ్ అంబానీ ఇల్లు.. చూడ్డానికి రెండు కండ్లు చాలవేమో !
Petrol Price | దిగొస్తున్న ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి..?
Stock market | స్టాక్ మార్కెట్ లో ముహూరత్ ట్రేడింగ్ కు ఎందుకు అంత ప్రాధ్యాన్యత ఇస్తారో తెలుసా..?
UAE power from waste | యూఏఈ సెన్సేషన్.. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

