అత్యాధునిక సౌకర్యాలతో పోలీస్ భవనాలు

ఒక్కో భవనాన్ని రూ.19 కోట్లతో పోలీసు కమిషనరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాలను నిర్మించారు. వీటిలో కమిషనర్, ఎస్పీ చాంబర్‌తోపాటు డీఎస్పీ చాంబర్లు, కాన్ఫరెన్స్‌హాల్, ఎస్బీ, పాస్‌పోర్టు వెరిఫికేషన్ సెల్ ఉంటాయి. మొదటి అంతస్థులో అడ్మినిస్ట్రేషన్, రెండో అంతస్థులో కమాండ్ కంట్రోల్ సెంటర్, ఎలక్ట్రికల్ ప్యానెల్‌రూం, ఐటీ కోర్‌టీం, క్లూస్ టీం విభాగాలు ఉంటాయి. ప్రజల వద్దకే ఎస్పీ, పోలీసుకమిషనర్ వెళ్లి మాట్లాడేలా పబ్లిక్ గ్రీవెన్స్‌హాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా జిల్లా, కమిషనరేట్ పరిధిలోని అన్నిప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు ఇక్కడి నుంచి చూసేలా ఏర్పాట్లుచేశారు. పరేడ్ గ్రౌండ్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్, బ్యారక్స్ ఏర్పాటుచేస్తున్నారు. భవన నిర్మాణ రెండోదశలో ఎమినిటీస్ బ్లాక్, డాగ్ కెన్నల్స్, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది నివాస గృహ సదుపాయాలు కల్పించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

