Bandi bhagirath | బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు..17 ఏండ్ల బాలికను ట్రాప్ చేసి.. మద్యం తాగించి, వేధించినట్టు ఫిర్యాదు
బండి పాపాల కోట బద్దలైంది. నేను కేంద్రమంత్రిని.. ఏమైనా చేయగలనని అహంకరిస్తే ఎదురుదెబ్బ తగిలింది. శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. బాధ్యతగల హోదాలో ఉన్న బండి సంజయ్ తన కొడుకుకోసం అడ్డదారులన్నీ తొక్కినట్టు ఆధారాలతో బయట పడింది. బాధిత కుటుంబంపైనే అధికార బలాన్ని ప్రయోగించినట్టు తేటతెల్లమైంది.
- మైనర్‌ను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు
- 17 ఏండ్ల బాలికను ట్రాప్ చేసి.. మద్యం తాగించి, వేధించినట్టు ఫిర్యాదు
- బాధిత కుటుంబం ఆరోపణలతో కేంద్రమంత్రి కొడుకుపై ఎఫ్ఐఆర్
- రాజీ కోసం బెదిరింపులు.. విననందుకు బాధితురాలిపైనే ఉల్టా కేసు!
- పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భగీరథ్‌పై అభియోగాలు
- మానసికంగా కుంగిపోయిన బాలిక.. రెండుసార్లు ఆత్మహత్యాయత్నం
- కేంద్రమంత్రి వైఖరితో న్యాయపోరాటానికి సిద్ధమైన బాధిత కుటుంబం
- రాజకీయ ఒత్తిళ్లు, నేరుగా బెదిరింపులు.. హనీట్రాప్ అంటూ ఉల్టా కేసు!
- మధ్యవర్తిగా రంగంలోకి దిగి, రాయబారం నెరిపిన ఓ బీజేపీ నేత!
- తండ్రి ముందే బాలికకు బండి కొడుకు వార్నింగ్ ఇచ్చినట్టు ఆరోపణ
- రాజీకి రాకపోతే అంతు చూస్తామంటూ హెచ్చరించారన్న కుటుంబం
- మైనర్ స్టేటస్‌పై పదే పదే బండి వ్యాఖ్యలతో తల్లిదండ్రుల్లో ఆందోళన
- పేట్‌బషీరాబాద్ పోలీసులకు బాధితురాలి తల్లి లిఖితపూర్వక ఫిర్యాదు
- కైంప్లెంట్ తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో ఐదారు గంటల హైడ్రామా!
- అదే సమయంలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో పోలీసుల మంతనాలు?
- బాధితులు పేట్‌బషీరాబాద్ ఠాణాలో ఉండగానే.. కరీంనగర్లో ఉల్టా కేసు
- ఎదురు కేసుతో బాధితురాలిపై కౌంటర్ స్ట్రాటజీ ప్రయోగించిన మంత్రి!
- న్యాయం జరుగకపోతే మోదీ సభలో ఆత్మార్పణకు సిద్ధమన్న బాలిక
- బాధిత కుటుంబం హెచ్చరికతో పెరిగిన ఒత్తిడి.. తప్పనిస్థితిలో ఎఫ్ఐఆర్
- ఎట్టకేలకు అర్ధరాత్రి తరువాత సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు
- దొరికిండు దొంగ..!
- ఫిర్యాదు సాక్షిగా దగా బట్టబయలు
- అవును.. ఆమెతో కలిసి తిరిగింది నిజమే !
- సరదాగా పలుమార్లు ట్రిప్పులకూ వెళ్లాం
- అమ్మాయి ఇంట్లో ఫంక్షన్లకు అటెండయ్యా
- ఫిర్యాదులో ఒప్పుకున్న కేంద్రమంత్రి కొడుకు
- పెండ్లి చేసుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు
- రూ.50 వేలు ఇచ్చాను.. 5 కోట్లు అడిగారు లేదంటే చనిపోతామని బెదిరించారు
- శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కరీంనగర్ టూటౌన్లో భగీరథ్ ఫిర్యాదు
- అటు బాలిక ఫిర్యాదుపై కాలయాపన.. ఇటు ఆమెపై హడావుడిగా హనీట్రాప్ కేసు
- పథకం ప్రకారమే కేసు పెట్టారని విమర్శలు
- ఫిర్యాదులో భగీరథ్ పేర్కొన్నట్టుగా నిర్మల్ ఠాణాలో ఎలాంటి కేసు నమోదు కాలేదు
- నిర్మల్ ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల వెల్లడి
బండి పాపాల కోట బద్దలైంది. నేను కేంద్రమంత్రిని.. ఏమైనా చేయగలనని అహంకరిస్తే ఎదురుదెబ్బ తగిలింది. శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు.. బాధ్యతగల హోదాలో ఉన్న బండి సంజయ్ తన కొడుకుకోసం అడ్డదారులన్నీ తొక్కినట్టు ఆధారాలతో బయట పడింది. బాధిత కుటుంబంపైనే అధికార బలాన్ని ప్రయోగించినట్టు తేటతెల్లమైంది.
కర్మ ఎవర్నీ వదలదు! ఎవర్ని పడితే వాళ్లను కేసులు పెడుతామని, జైల్లో తోస్తామని బెదిరింపులకు దిగితే… అదే ఒకనాడు ఎదురుతిరిగి వడ్డీతో సహా తిరిగిస్తుంది! తండ్రి తంతెల మీద ఉంటే కొడుకు కోనేట్ల ఉంటడా? బండి భగీరథ దాన్ని రుజువు చేశాడు. కాంగ్రెస్ రహస్య మిత్రుడు కేసును తొక్కిపెట్టాలని చూసినా, పోలీసులు మూడు నెలలపాటు సాగదీసి సహకరించినా కాలం కలిసిరాలేదు. డబ్బులతో పాపాన్ని కడిగేసుకోవాలన్న ఎత్తూ చిత్తయ్యింది. రాజీ కోసం చేసిన బెదిరింపులూ పనిచేయలేదు. బండి సంజయ్ కొడుకుపై పేట్ బషీరాబాద్ పీఎస్‌లో పోక్సో కేసు నమోదైంది.
ఇటీవల యూపీలో ఒక అమ్మాయి మీద లైంగికదాడి జరిగితే.. నిందితుడి తల్లిదండ్రులు ఒక్కటే చెప్పారు! ‘తప్పు చేసింది ఎవరైనా తప్పు తప్పే! మా కొడుకును కావాలంటే ఎన్కౌంటర్ చేసుకోండి’ అని తెగేసిచెప్పారు. ఆడబిడ్డ వేదన తెలిసిన సామాన్యుడి స్పందన ఎంత హుందాగా ఉన్నది? మరి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హోదాలో మహిళలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత గల బండి సంజయ్ ఏం చేయాలి? కొడుకుకు అంటకాగుతూ బాధిత బాలికపైనే ఉల్టా కేసు పెట్టేందుకు ఎందుకు సహకరించారు? ఇదేనా బీజేపీ చెప్పే ‘బేటీ బచావో’? ఇదేనా ‘నారీశక్తి సమ్మాన్’?
హైదరాబాద్ సిటీబ్యూరో/కరీంనగర్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. బాలికను ట్రాప్ చేసి పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి యత్నించాడని బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భగీరథ్‌పై కేసు నమోదు చేసినట్టు పేట్ బషీరాబాద్ సీఐ విజయ్‌వర్ధన్, కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. అంతకు ముందు రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు కాకుండా పోలీస్ స్టేషన్లో పెద్ద హైడ్రామా నడిచింది.
ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉండే బాలికను 2025 జూన్‌లో తన స్నేహితుల ద్వారా కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు స్నేహంగా ఉన్న తర్వాత ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. 18 ఏండ్లు నిండిన తర్వాత పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. నిరుడు అక్టోబర్ 25న ఆమెను నానక్‌రామ్‌గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు తన స్నేహితులతో కలిసి తీసికెళ్లాడు. అక్కడ రెండు మూడు రోజులు ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ శారీరక హింసకు గురిచేశాడు. ఆ తర్వాత నవంబర్‌లో మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు తీసికెళ్లి అక్కడా వేధింపులకు గురి చేశాడు. నిరుడు డిసెంబర్ 31న రాత్రి బాలికను మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లాడు.
అక్కడికి తన స్నేహితులు ఐదుగురు యువకులు, ఇద్దరు అమ్మాయిలు వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత ఫుల్లుగా మద్యం తాగిన భగీరథ, బాలిక గదిలోకి ప్రవేశించి ఆమెకు మద్యం తాగించేందుకు విశ్వప్రయత్నం చేసి, ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. లైంగిక చర్యకు ఒప్పుకోవాలంటూ ఆమెను తీవ్రంగా ఒత్తిడి చేయడంతో బాలిక అందుకు నిరాకరించింది. అక్కడున్న పరిస్థితులు, భగీరథ్ ఒత్తిడితో బాలిక తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేయడమే కాకుండా ఆమె పైచదువుల కో సం లండన్ వెళ్లనీయకుండా భగీరథ్ కట్టడి చేశాడు. దీంతో బాలిక మానసికంగా కుంగిపోయింది. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య విరామం వచ్చింది. ఈ నేపథ్యంలో బాధితురాలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో వైరల్ చేయడమే కాకుండా, ఒక ఫంక్షన్లో స్నేహితులతో కలిసిన సమయంలో బాలికను కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడటంతో బాలిక మరింత కుంగిపోయింది.
అతడి చేష్టలతో రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించింది. తనను మోసం చేయడమే కాకుండా మానసికంగా వేధిస్తున్నావంటూ భగీరథ్‌ను నిలదీసింది. ‘నా వెనుక పెద్ద బాక్గ్రౌండ్ ఉన్నది.. నువ్వేం చేస్తవ్ నన్ను?’ అంటూ బెదిరించడంతో బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. తనకు చేసిన మోసంపై అన్ని ఆధారాలూ ఉన్నాయని, పోలీస్‌స్టేషన్‌లోనే తేల్చుకుంటానని భగీరథ్‌కు చెప్పడంతో ముందుగా అప్రమత్తమై ఏప్రిల్‌లో నిర్మల్ పోలీసులకు తన స్నేహితుడు శ్రీరామ్‌తో భగీరథ్ ఫిర్యాదు చేయించేందుకు ప్రయత్నించాడు. తన తండ్రి పలుకుబడితో నిర్మల్ పోలీస్ అధికారి ఒకరు బాధితురాలి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి అక్కడ కేసు నమోదు చేసినట్టుగా బెదిరించారు. ఓవైపు భగీరథ్ వేధింపులు, మరోవైపు పోలీసుల బెదిరింపులతో మానసికంగా మరింత వేదనకు గురైంది.
ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్న అంశాలు
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ నా కుమార్తెను శారీరక అవసరాలు తీర్చాలని వేధించాడు. మానసికంగా హింసించాడు.
- 2025, జూన్‌లో నా కూతురు స్నేహితుల ద్వారా పరిచయమైన బండి భగీరథ్ అప్పటి నుంచి ఇన్‌స్టా, స్నాప్‌చాట్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా సంబంధాలు కొనసాగించాడు. మైనారిటీ తీరగానే వివాహం చేసుకుంటానని మాయమా టలు చెప్పి ఆమె మనసు మార్చాడు. నా కూతురు అతడు చెప్పిన మాటలు నమ్మింది. చివరికి నా కూతురు చదువు, ఇతర వ్యక్తిగత విషయాల్లోనూ నిర్ణయాలను అతడు ప్రభావితం చేశాడు.
- మానసికంగా వేధించడం ఆపై సారీ చెప్పడం ద్వారా ఆమెను అనేకసార్లు మనస్తాపానికి గురి చేశాడు. తరచూ కొంపల్లిలోని అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి తన శారీరక అవసరాలు తీర్చాలని, ఆమె తిరస్కరించినా తీవ్రంగా ఒత్తిడి చేశాడు.
- నిరుడు అక్టోబర్, నవంబర్‌లో మా అపార్టుమెంట్ దగ్గరికి వచ్చి సెల్లార్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఆమెకు ముద్దు పెట్టేందుకు తీవ్రంగా యత్నిస్తే నా కూతురు ప్రతిఘటించింది.
- నిరుడు అక్టోబర్ 25న ఇద్దరు స్నేహితులతో కలిసి అర్ధరాత్రి నా కూతురిని నానక్‌రాంగూడలో ఉన్న తన అపార్టుమెంట్‌కు తీసుకువెళ్లి, రెండు, మూడు రోజులు అక్కడే ఉండాలని ఒత్తిడి చేశారు. నా కూతురు ఎంత చెప్పినా వినకుండా అక్కడే రాత్రంతా ఉండాలంటూ లైంగికంగా వేధించాడు. నవంబర్ 13న కూడా మొయినాబాద్‌లోని లక్స్ చరణ్ ఫామ్స్‌లో ఇదే రీతిలో ప్రవర్తించాడు.
- ఈ సమయాల్లోనే అనేకసార్లు నా కూతురిని అనేక ప్రైవేట్ స్థలాలకు తీసుకువెళ్లాడు. 2025, డిసెంబర్ 31న న్యూ ఇయర్ వేడుకలు అంటూ మొయినాబాద్‌లోని అనన్య ఫాంహౌస్‌కు తీసుకెళ్లి అక్కడ చేసిన ఘోరాన్ని నా కూతురు నా దృష్టికి తీసుకువచ్చింది. ఐదుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలతో కలిసి జరుపుకు న్న వేడుకల్లో నా కూతురుకు బలవంతంగా మద్యం తాగించాడు. అప్పటికే ఫూటుగా తాగిన భగీరథ్ అర్ధరాత్రి 1.30-2.30 గంటల సమయంలో నా కూతురు నిద్రిస్తున్న గదిలోకి చొరబడి తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటిస్తున్నా వినకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికవాంఛ తీర్చాలంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. మైనర్ అయిన నా కూతు రు చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో నిస్సహాయురాలై ప్రతిఘటించలేకపోయింది. ఆ ఘటనతో నా కూతురు తీవ్ర మనోవేదనకు గురైంది. అది ఆమె మనసుపై తీవ్ర ప్రభావం చూపింది.
- ఆ తర్వాత కూడా భగీరథ్ వ్యవహరించిన తీరు, వేధింపులకు సంబంధించి వారి మధ్య జరిగిన చాట్స్, సంభాషణలు కూడా పోలీసులకు సమర్పిస్తున్నాను. నా కూతురిని లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా భావోద్వేగంగా ప్రలోభాల పెడుతూ పూర్తిగా ఆమెను అయోమయానికి గురిచేశాడు. ఈ క్రమంలోనే ఆమెను లోబరుచుకునేందుకు ప్రయత్నించాడు.
- ఈ ఏడాది జనవరి 7న ఒక్కసారిగా నా కూతురుతో సంబంధాన్ని తెంచుకొని అప్పటివరకు తన చర్యలకు బాధ్యత వహించేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో జనవరి 13న తీవ్ర భయాందోళనలతో నన్ను చాట్స్ ద్వారా సంప్రదించి నా కూతురు పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేశాడు. ఆమెకు సర్దిచెప్పాలని నాకు సూచించాడంటే నా కూతురు అనుభవించిన మానసిక క్షోభ ఎంతలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
- భగీరథ్ నా కూతురిని మానసికంగా, లైంగికంగా వేధించడంతో కుంగిపోయిన ఆమె జనవరి 19, జనవరి 26న రెండు పర్యాయాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది.
- ఈ సంఘటనల తర్వాత భగీరథ్ ఉద్దేశపూర్వకంగా నా కూతురితో ఉన్న వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, రహస్య సమాచారాన్ని ఇతరులకు షేర్ చేస్తూ ప్రచారం చేస్తున్నాడనే విశ్వసనీయ సమాచారంతో నా కూతురు ఇంకా మానసిక వేదనకు గురైంది.
- నా కూతురి పరిస్థితి చూసి ఇక తాళలేక న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రయత్నాలు మొదలుపెట్టగానే మాకు బెదిరింపులు, ఒత్తిళ్లు మొదలయ్యాయి. మా న్యాయపరమైన అడుగులు తెలుసుకొని భయపడి తిరిగి మమ్మల్నే బెదిరించడంలో భాగంగా నా కూతురును భగీరథ్‌కు పరిచయం చేసిన అతడి స్నేహితుడితో నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లో ఏప్రిల్ 23న తప్పుడు కేసు పెట్టించాడు. నా కూతురే భగీరథ్‌తో పాటు ఆయన కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
- ఈ కేసు ద్వారా నా కూతురుతోపాటు మా కుటుంబంపైనా ఒత్తిడి తెచ్చాడు. తన రాజకీయ, అధికార బలంతో మా కుటుంబాన్ని ఖతం చేస్తానని బెదిరించాడు. రాష్ట్రవ్యాప్తంగా తప్పుడు కేసులు పెట్టించి మీ కుటుంబం అంతు చూస్తానని హెచ్చరించాడు. మేం ఎప్పుడైతే న్యాయపరంగా అడుగులు వేయడం మొదలుపెట్టామో అప్పటి నుం చే భగీరథ్ అక్రమ, కుట్రపూరితమైన కేసులు పెట్టించడం మొదలుపెట్టాడు.
- నిర్మల్‌లో నా కూతురుపై తప్పుడు కేసు పెట్టిన మరుసటి రోజే అంటే ఏప్రిల్ 22న సంగప్ప (బీజేపీ నేత) నాకు చాలా మంది ప్రముఖులు తెలుసునంటూ మా ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు అంటే 23న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో కూర్చుని మాట్లాడుకుందామని సలహా ఇచ్చాడు. చెప్పినట్టుగానే బండి సంజయ్‌తో మేం కూర్చొని మాట్లాడినప్పుడు బండి సంజయ్ నా కూతురుకు కౌన్సిలింగ్ చేశాడు. సంజయ్ కుమారుడు భగీరథ్ ఒకడుగు ముందుకేసి రాజీకి వద్దాం.. నిర్మల్ పోలీస్‌స్టేషన్‌లో కొన్ని డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయాలన్నాడు. బండి సంజయ్‌తో కలిసిన సమయంలో మాకు చాలా భయమేసింది.. ముఖ్యంగా బండి సంజయ్ పదేపదే నా కూతురు మైనర్ అనే అంశంపై చేసిన వ్యాఖ్యలు మరింత ఆందోళనకు గురి చేసింది.
- ఈ వరుస ఘటనలు, పరిణామాలన్నీ పొక్సో చట్టం-2012 కిందకు వస్తాయి. మైనర్‌పై లైం గిక వేధింపులు, లైంగికంగా సంబంధాలు పెట్టుకోవడం, వివాహం చేసుకుంటానని నమ్మించడం వంటివన్నీ వీటి కిందకే వస్తాయని సుప్రీంకోర్టూ చెప్పింది. నా కూతురును అన్నిరకాలుగా వేధించిన బండి భగీరథ్, తప్పుడు కేసు పెట్టిన అతడి స్నేహితుడిపై వెం టనే కఠిన చర్యలు తీసుకోవాలి. నా కూతురుకు రక్షణ కల్పించాలి.
బండి సంజయ్ ఎంట్రీ!
కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుడు వెళ్లి బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించాడు. బండి సంజయ్ వద్దకు తీసుకెళ్లి మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో కొడుకు చేసింది తప్పని చెప్పాల్సిన బండి, తన కొడుకును వెనకేసుకు రావడమే కాకుండా బాధితులపైనే బెదిరింపులకు దిగాడు. దీంతో తమకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేయాలని భావించిన బాధిత కుటుంబం శుక్రవారం పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది.
పోలీస్‌స్టేషన్‌లో హైడ్రామా!
బాలికపై లైంగిక దాడికి యత్నించిన భగీరథ్‌పై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్‌స్టేషన్‌కు శుక్రవారం సాయంత్రం వెళ్తే గంటల తరబడి ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు నిరాకరించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకుపై ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి చర్చలు నడిపారు. ‘మీ ఫిర్యాదును వెంటనే న్యాయ సలహాకు పంపాలి. ఆ తర్వాతే మేం నిర్ణయం తీసుకుంటాం’ అంటూ ఆలస్యం చేశారు. సుమారు ఆరు గంటల పాటు బాధితులను పోలీస్‌స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. అప్పటికే విసుగెత్తిన బాధిత కుటుంబం ఫిర్యాదు తీసుకోకుంటే కోర్టుకు పోతామని, ఆదివారం జరిగే మోదీ సభలో నిరసన తెలుపుతామని హెచ్చరించడంతో పోలీసులకు చివరికి భగీరథ్‌పై కేసు నమోదు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

