న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక ప్రజలు ఆరాధించే ప్రముఖుల జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిస్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ రెండో స్థానం దక్కించుకున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8వ స్థానంలో నిలిచారు. డాటా అనలిటిక్స్ సంస్థ యూగవ్ 2021 సంవత్సరానికి విడుదల చేసిన సర్వే నివేదిక ఈ సంగతి వెల్లడించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డో, అంతర్జాతీయ సినీనటుడు జాకీచాన్ వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. జాబితాలో మొదటి 20 స్థానాల్లో చోటుదక్కిన భారతీయుల్లో క్రికెటర్ సచిన్ టెండ్లూకర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్స్టార్లు అమితాబ్ బచ్చన్, షారుక్‌ఖాన్ ఉన్నారు. మహిళల జాబితాలో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా, హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ, బ్రిటన్ రాణి రెండో విక్టోరియా వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు.