నా ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ఆరోపణలు
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ మహి ళా అధ్యాపకురాలు చేసిన వేధింపుల ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు, కల్పితాలని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు.
- విచారణ జరుపాలని డీజీపీకి వ్యవసాయ వర్సిటీ వీసీ లేఖ
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ మహి ళా అధ్యాపకురాలు చేసిన వేధింపుల ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు, కల్పితాలని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా సాగిన ఈ కుట్రపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీకి మంగళవారం లేఖ రాశారు. వర్సిటీ లో పరిపాలనాపరమైన సంసరణలు, నిబంధనల మేరకే సెప్టెంబర్ 11న సదరు మహిళా అధ్యాపకురాలిని నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లోని కాలేజ్ ఆఫ్ ఫుడ్‌సైన్స్ అండ్ టెక్నాలజీకి బదిలీ చేసినట్టు తెలిపారు. బదిలీ ఇష్టంలేని అధ్యాపకురాలు అసంతృప్త శక్తులతో కలిసి తనపై లేనిపోని అసత్య ప్రచారాలకు దిగారని ఆ లేఖలో వివరించారు.
ఈ నెల 7న ఆ అధ్యాపకురాలు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి, తనపై వే ధింపులు జరిగాయని ఆరోపించడాన్ని వీసీ ఖండించారు. 11 నెలలపాటు మౌనంగా ఉండి, బదిలీ జరిగాక మాత్రమే ఇలాంటి ఆరోపణలతో మీడియా ముందుకు రావడం ఓ కట్టుకథ అని స్పష్టమవుతున్నదని పేరొన్నారు. తన వయస్సు 64 ఏండ్లు అని, జీవిత చరమాంకంలో ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు రావడం మానసిక క్షోభకు గురిచేసిందని తెలిపారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే.. కొద్ది నెలలుగా సదరు మహిళా ఫ్యాకల్టీకి, తనకు మధ్య జరిగిన ఫోన్‌కాల్ డాటా, వాట్సాప్ చాట్‌తోపాటు రికార్డులను ఫోరెన్సిక్ లేదా పోలీసు దర్యాప్తు ద్వారా క్షుణ్ణంగా పరిశీలించాలని డీజీపీని అభ్యర్థించారు.
కుట్రలు సహించేది లేదు : బీసీ సంఘాలు
బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య వైస్‌చాన్సలర్‌గా నియామ కం కావడాన్ని కొందరు జీర్ణించుకోలేక కుట్ర లు పన్నుతున్నారని బీసీ సంఘాలు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశాయి. హైదరాబాద్‌లోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కులచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. మహిళా ప్రొఫెసర్‌ను అడ్డం పెట్టుకొని నిజాయితీపరుడైన బీసీ వీసీపై నిరాధార ఆరోపణలు చేస్తూ బదనాం చేయాలని చూస్తే బీసీ సమాజం చూస్తూ ఊరుకోబోదని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

