కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీహెచ్ శ్రీనివాసరావు
డీహెచ్ శ్రీనివాస రావు | రాష్ట్రంలో వరుస పండుగల దృష్ట్యా ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావు సూచించారు.

హైదరాబాద్ : రాష్ట్రంలో వరుస పండుగల దృష్ట్యా ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు సూచించారు. డెల్టా వేరియంట్ వ్యాప్తిని ప్రభుత్వ సహకారంతో వ్యూహాత్మకంగా ఎదుర్కొంటున్నామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం కోఠిలోని తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి (రెండో వేవ్) మరో రెండు నెలల వరకు కొనసాగుతుందని భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని తక్కువ కాలంలో కట్టడి చేయగలిగాం. కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలిచిందని శ్రీనివాస రావు అన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, అలాంటి చోట్ల వైరస్ కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కేసులు తక్కువగా ఉన్నప్పుడే వైరస్ వ్యాప్తిని సులువుగా నియంత్రించగలమని అభిప్రాయపడ్డారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

