పీసీబీలో ల్యాబ్‌లు, సైంటిస్టుల సంఖ్యను పెంచాలి
కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ల్యాబొరేటరీలు, సైంటిస్టుల సంఖ్యను పెంచుకోవాలని, ఇంజినీర్ల సంఖ్యకు సమానంగా సైంటిస్టులను నియమించుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) ఇటీవల రాష్ర్టాలను ఆదేశించాయి.
- ఇంజినీర్ల సంఖ్యకు సమానంగా సైంటిస్టులను నియమించుకోవాలి
- ఎన్జీటీ, సీపీసీబీ ఆదేశాలు
- కేంద్రం ఆదేశాలు పట్టని పీసీబీ
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ల్యాబొరేటరీలు, సైంటిస్టుల సంఖ్యను పెంచుకోవాలని, ఇంజినీర్ల సంఖ్యకు సమానంగా సైంటిస్టులను నియమించుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) ఇటీవల రాష్ర్టాలను ఆదేశించాయి. కానీ, ఈ ఆదేశాలను తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలోని కొందరు ఉన్నతాధికారులు, ఇంజనీర్లు కాలపరిమితి (పూర్తి అదనపు బాధ్యత)తో నియమితులవుతున్న మెంబర్ సెక్రటరీలను తప్పుదోవ పట్టిస్తూ పీసీబీ విస్తరణ, బలోపేతానికి ఎలాంటి శాస్త్రీయ కమిటీని ఏర్పాటు చేయకుండా ఎన్జీటీ, సీపీసీబీ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల విస్తరణ, బలోపేతం కోసం 42 పోస్టులను ప్రతిపాదించింది. వీటిలో భౌతిక తనిఖీలకు పెద్దపీట వేసి ఒక ఇంజనీరింగ్ విభాగానికే 26 పోస్టులను, పరిశ్రమల్లో శాస్త్రీయ తనిఖీల కోసం సైంటిఫిక్ విభాగానికి తూతూ మంత్రంగా కేవలం 9 పోస్టులు కేటాయించారు.
ఇందుకు సంబంధించిన ఫైల్‌పై పర్యావరణ శాఖ మంత్రిని పరిగణనలోకి పీసీబీ ఉన్నతాధికారులు, ఇంజినీర్లే గత వారం స్వయంగా సంతకం చేయించుకునేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఈ విషయం బయటికి పొక్కడంతో పర్యావరణ శాఖ మంత్రి అభ్యంతరం చెప్పినట్టు పీసీబీలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా పూర్తి సిబ్బందిని నియమించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

