కిన్నెర కళాకారుడికి పవన్ కల్యాణ్ సాయం

- మొగులయ్యకు రూ.2 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటన
అచ్చంపేట, సెప్టెంబర్ 4: కిన్నెర కళకు సినీహీరో పవన్ కల్యాణ్ ప్రోత్సాహం అందించారు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన జానపద కళాకారుడు, 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శన మొగులయ్యకు సినీ నటుడు పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. భీమ్లానాయక్ సినిమాలోని గీతానికి కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన కళాకారుడికి సాయం అందిస్తున్నట్టు చెప్పారు. కనుమరుగవుతున్న ఇలాంటి జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపన పవన్ కల్యాణ్‌లో ఉన్నదని జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పవన్ స్థాపించిన లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ ద్వారా మొగులయ్యకు సాయం అందజేస్తామని తెలిపారు. పవన్ ఆర్థిక సాయం ప్రకటించడంపై మొగులయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ డబ్బులతో సొంతూరిలోని తన ఇంటికి మరమ్మతు చేయిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

