హైదరాబాద్‌కు పార్క్ప్లేస్

- గ్లోబల్ ఐటీ, ఇన్ఫ్రా సొల్యూషన్స్ సంస్థ
- రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో కార్యాలయం
- భారత్‌లో కంపెనీ తొలి కార్యాలయం ఇదే
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు మరో ప్రఖ్యాత కంపెనీ రాబోతున్నది. భారత్‌లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నట్టు గ్లోబల్ ఐటీ, ఇన్ఫ్రా కంపెనీ పార్క్ ప్లేస్ టెక్నాలజీస్ ప్రకటించింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీలకు నెలవుగా ఉన్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. 150 మంది పనిచేసేలా 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన శిక్షణ కేంద్రం, మీటింగ్ హాల్స్, జిమ్, స్విమ్మింగ్‌పూల్, యాంఫీ థియేటర్ లాంటి అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని తీర్చిదిద్దనున్నట్టు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పరిశ్రమలకు అందజేస్తున్న ప్రోత్సాహకాలు, హైదరాబాద్‌లోని సానుకూల వాతావరణం, మౌలిక వసతులు తమను అమితంగా ఆకట్టుకున్నాయని, అందుకే భారత్‌లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నామని ఆ కంపెనీ స్పష్టం చేసింది. వ్యాపారాభివృద్ధిలో భాగంగా భారత్‌లో పెట్టుబడి పెట్టి ఇప్పటికే డజను మందికిపైగా అసోసియేట్స్‌కు శిక్షణ ఇచ్చిన పార్క్ ప్లేస్ టెక్నాలజీస్‌కు ప్రస్తుతం దేశంలో 400కుపైగా స్థానిక, అంతర్జాతీయ బ్లూచిప్ క్లయింట్లు ఉన్నారు.
హైదరాబాద్ డైనమిక్ సిటీ: క్రిస్ అడమ్స్
హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ డైనమిక్ సిటీగా పార్క్ ప్లేస్ టెక్నాలజీస్ సీఈవో, అధ్యక్షుడు క్రిస్ ఆడమ్స్ అభివర్ణించారు. అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి పొందిన ఐటీ, ఈ-కామర్స్ కంపెనీలు హైదరాబాద్‌కు రావడానికి ఇదే కారణమని తెలిపారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేవని, నగరంలో ఒకచో ట నుంచి మరో చోటకు తక్కువ సమయంలో ప్రయాణించగలిగే సౌకర్యాలు ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో తమ తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భారత్‌లో తమ ప్రణాళికలను మరింత విస్తరించనున్నట్లు క్రిస్ ఆడమ్స్ చెప్పారు.
హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమ డైనమిక్ సిటీ. అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి పొందిన ఐటీ, ఈ-కామర్స్ కంపెనీలు హైదరాబాద్‌కు రావడానికి ఇదే కారణం. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేవు. నగరంలో ఒకచోట నుంచి మరో చోటకు తక్కువ సమయంలో ప్రయాణించగలిగే సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మా తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భారత్‌లో ప్రణాళికలను మరింత విస్తరించనున్నాం. -పార్క్ ప్లేస్ టెక్నాలజీస్ సీఈవో, అధ్యక్షుడు క్రిస్ ఆడమ్స్
పార్క్ ప్లేస్ టెక్నాలజీస్స్థాపించినది -1991
పరిశ్రమ ఐటీ, సేవలు, ఉద్యోగులు 5,000
హెడ్ ఆఫీస్: మేఫీల్డ్ హైట్స్, ఒహియో, యూఎస్
ప్రత్యేకతలు: నిర్వహణ-సహకార సేవలు, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్-ఇన్స్టాలేషన్, ఎక్విప్మెంట్ రీలొకేషన్, హార్డ్‌వేర్ డిస్పోజల్, ఐటీ అసెట్ మేనేజ్మెంట్, ఎక్విప్మెంట్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్స్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- park place
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

