Durga Rao | పోలీసుల అదుపులో పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావు
పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారవును (Durga Rao) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడిగా ఉన్నారు.
హైదరాబాద్: పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారవును (Durga Rao) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రోడ్డు ప్రమాదం కేసులో దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. షకీల్ కొడుకు పారిపోయేందుకు ఆయన సహకరించాడని ఉన్నతాధికారులు తేల్చడంతో సీపీ కొత్తకోత శ్రీనివాస్ ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టు తప్పదన్న వార్తల నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నారు. అప్పటి గాలిస్తున్న పోలీసులకు సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లులో పట్టుబడ్డారు. విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేయనున్నారు.
డిసెంబర్ 24న అర్ధరాత్రి ప్రజాభవన్ వద్ద తన కారుతో బారికేడ్‌ను ఢీకొట్టిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్.. అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదుచేసిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. అయితే సాహిల్ దేశం విడిచి వెళ్లేందుకు సహకరించాడని దుర్గారావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈమేరకు తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాల ని కోరుతూ స్థానిక ఇన్స్పెక్టర్ బీ దుర్గారావు హైకోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్టు చేస్తే తన కెరీర్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని పిటిషన్లో పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

