జేఎన్టీయూ వీసీ అవినీతిపై విచారణ జరుపాలి
జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ టీకేకే రెడ్డి అవినీతిపై సమగ్ర విచారణ జరుపాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వీసీ తన భార్యను అడ్డుపెట్టుకుని జూబ్లీహిల్స్ క్లబ్, గోల్ఫ్ క్లబ్‌లను కేంద్రాలుగా చేసుకుని వారాంతాల్లో వసూళ్లు చేస్తున్నారని సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
- భార్యను అడ్డుపెట్టుకుని పెద్దఎత్తున వసూళ్లు
- జూబ్లీహిల్స్ క్లబ్, గోల్ఫ్ క్లబ్ అడ్డాగా దందా
- వీసీ భార్య చేసిన ఫిర్యాదును ఖండిస్తున్నా
- జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్/జనగామ, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ టీకేకే రెడ్డి అవినీతిపై సమగ్ర విచారణ జరుపాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. వీసీ తన భార్యను అడ్డుపెట్టుకుని జూబ్లీహిల్స్ క్లబ్, గోల్ఫ్ క్లబ్‌లను కేంద్రాలుగా చేసుకుని వారాంతాల్లో వసూళ్లు చేస్తున్నారని సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. వీసీ అవినీతి, అక్రమాలతో యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారుతున్నదని ఫైర్ అయ్యారు. యూనివర్సిటీలోని వీసీ కార్వర్ట్ను బార్లా మార్చేశారని మండిపడ్డారు. పరిశోధనలు, స్టార్టప్స్‌కు కేంద్రంగా మారాల్సిన విద్యాకేంద్రం.. అవినీతి, అక్రమాలకు నిలయంగా మారడం శోచనీయమని అన్నారు.
ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను వివాదాల్లోకి లాగరాదని సూచించారు. వర్సిటీ వ్యవహారాల్లో వీసీ భార్య మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు. కాంట్రాక్టుల కేటాయింపు, డైరెక్టర్లు, డీన్ల వంటి కీలక పదవుల నియామకాలు, బదిలీలు, యూనివర్సిటీ విధానపరమైన నిర్ణయాల్లో వీసీ భార్య అతిగా జోక్యం చేసుకుంటున్నారని తెలిపారు. కొందరు వ్యక్తులు వీసీ భార్యను ప్రసన్నం చేసుకుని.. పదవులు పొందుతున్నారని చె ప్పారు. ఏఐసీటీఈ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో వీసీ ప్రొఫెసర్ టీకేకే రెడ్డిని అవినీతి ఆరోపణలతో తొలగించారని, రెక్టార్‌గా ఉన్న సమయంలో దళిత విద్యార్థిని దూషించడం తో ఆ పదవి నుంచి కూడా ఆయనను తప్పించారని గుర్తుచేశారు. 4 ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఆయన నియామకం జరిగిన కొద్దికాలంలోనే ఉద్వాసనకు గురయ్యారని పేర్కొన్నారు.
వీసీ భార్య ఆరోపణలు అవాస్తవం
తనపై వీసీ భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడాన్ని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖండించారు. తనను తిట్టినట్టు, బెదిరించినట్టు గత నెల 8న పోలీస్‌స్టేషన్‌లో సుజనారెడ్డి ఫిర్యాదు చేసిన ఆరోపణలు అవాస్తవమని స్పష్టంచేశారు. సుజనారెడ్డి ఎవరో తనకు తెలియదని, ఆమెను ఎప్పుడూ చూడలేదని, మాట్లాడలేదని అన్నారు. తాను జేఎన్టీయూ వీసీకి ఫోన్ చేసినప్పుడు, మరెవరో ఎత్తారని, వీసీతోనే మాట్లాడుతానని చెప్పి తాను ఫోన్ పెట్టేశానని చెప్పారు. తర్వాత వీసీతో మాట్లాడినట్టు తెలిపారు. సీనియర్ ప్రొఫెసర్లను, ముఖ్యంగా మహిళా ప్రొఫెసర్లను దూషించడానికి కారణాలేమిటని ప్రశ్నించానని అన్నారు. వీసీ తప్పు జరిగిందని అంగీకరిస్తూ క్షమాపణ కోరారు.
తాను తిరుపతి నుంచి తిరిగి వచ్చిన తర్వాత లేఖ ఇస్తానని చెప్పారు. ఇది జరిగిన వాస్తవం.. వీసీ క్షమాపణపత్రం ఇస్తానని చెప్పినప్పటికీ, మరుసటి రోజు సాయంత్రం వరకు అది రాకపోవడంతో మహిళా ప్రొఫెసర్లు పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు అందించకుండా, తన భార్యతో నాపై ఫిర్యాదు చేయించారు. నేను వీసీతో ఫోన్లో ఏం మాట్లాడాననే విషయం కాల్ రికార్డులను పరిశీలిస్తే స్పష్టమవుతాయి. మహిళా ప్రొఫెసర్లతో వీసీ దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు సంబంధిత సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించాలని ఎమ్మెల్యే కోరారు. వీసీ భార్య జోక్యం లేకుండా వర్సిటీని నడిపించేలా తగిన చర్యలు తీసుకోవాలని, తమ విద్యాసంస్థలకు చెందిన మహిళా ప్రొఫెసర్లతో వీసీ దురుసు ప్రవర్తనపై పోలీసులు సమగ్ర విచారణ జరుపాలని పల్లా డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

