విద్యార్థిగా రండి.. సివిల్ సర్వెంట్‌గా వెళ్లండి
‘విద్యార్థిగా రండి.. సివిల్ సర్వెంట్‌గా వెళ్లండి’ అంటూ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
- త్వరలో ఓయూలో సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏర్పాటు
- ఒకేసారి 800 మంది చదువుకొనేలా స్టడీ సెంటర్
- అన్ని పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ లభ్యం
- ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ‘విద్యార్థిగా రండి.. సివిల్ సర్వెంట్‌గా వెళ్లండి’ అంటూ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఓయూ క్యాంపస్‌లో నెలలోగా సివిల్ సర్వీసెస్ అకాడమీని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఓయూ విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సివిల్ సర్వీసులు, సెంట్రల్ సర్వీసులతో పాటు గ్రూప్-1, గ్రూప్-2 వంటి స్టేట్ సర్వీసులు, ఉపాధ్యాయ, పోలీసు ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా దీనిని ఏర్పాటుచేస్తున్నట్టు వివరించారు.
అకాడమీలో దాదాపు 800 మంది విద్యార్థులు ఒకేసారి చదువుకొనే వసతి ఉంటుందని చెప్పారు. సివిల్స్‌కు అవసరమైన స్టడీ మెటీరియల్, రిఫరెన్స్ పుస్తకాలు, ఫర్నీచర్ తదితర ఏర్పాట్లు తుది దశలో ఉన్నాయని వివరించారు. సివిల్స్‌తో పాటు రాష్ట్రంలో 80 వేలకు పైగా పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల స్టడీ మెటీరియల్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. పేరొందిన పబ్లికేషన్ల మెటీరియల్‌ను తెప్పించడంతో పాటు సబ్జెక్టు నిపుణులతో ప్రత్యేకంగా ఓయూ స్టడీ మెటీరియల్‌ను రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. ఆర్థికంగా వెనుకబడిన, గ్రామీణ, తెలుగు మీడియం విద్యార్థులకు అకాడమీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. సైఫాబాద్ పీజీ కాలేజీలోనూ పోటీ పరీక్షల స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

