Osmania University | బీఈడీ పరీక్షా పేపర్ల రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా పేపర్ల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా పేపర్ల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను ఇప్పటికే విడుదల చేశామని, ఫలితాలను తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మార్కు మెమోలను సంబంధిత కళాశాల నుంచి మూడు వారాల తర్వాత పొందవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్ష పేపర్ల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.700 చొప్పున చెల్లించి ఈ నెల 17వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో 20వ తేదీ వరకు టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జవాబు పత్రాల నకలు పొందగోరువారు ఒక్కో పేపర్‌కు రూ. 1000 చొప్పున చెల్లించి వచ్చే నెల 5వ తేదీ వరకు తమ కార్యాలయంలో చెల్లించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

