Osmania University | ఓయూ పరిధిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలతో పాటు బీపీఈడీ వన్ టైం చాన్స్ పరీక్షలను వచ్చే నెల ఆరవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ లో చూసుకోవాలని సూచించారు.
వివిధ లా కోర్సుల పరీక్ష ఫీజు స్వీకరణ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ లా కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
మూడేళ్ల ఎల్.ఎల్.బి, మూడేళ్ల ఎల్.ఎల్.బి ఆనర్స్, ఐదేళ్ల బి ఏ ఎల్ ఎల్ బి, ఐదేళ్ల బికాం ఎల్.ఎల్.బి, ఐదేళ్ల బి బి ఏ ఎల్ ఎల్ బి తదితర కోర్సుల మూడో సెమిస్టర్, ఎల్.ఎల్.ఎమ్ మొదటి, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును వచ్చే నెల 11వ తేదీలోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ. 200 అపరాధ రుసుముతో 15వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు.
ఈ పరీక్షలను మార్చ్, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో చూసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

