నిలువ నీడలేదు..సాయం చేయండి సారూ!

- తల్లిదండ్రుల మృతితో అనాథలైన అక్కాతమ్ముడు
- దాతల చేయూతతో గోడల వరకే ఇంటి నిర్మాణం
- పైకప్పు నిర్మాణానికి సాయం కోసం ఎదురుచూపులు
సంస్థాన్ నారాయణపురం, జూలై 2: ఏడేండ్ల క్రితం తండ్రిని, ఏ డాది క్రితం తల్లిని కోల్పోయి ఆ ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఉండటానికి నిలువ నీడలేక అవస్థ పడుతున్నా రు. ఇటీవలి వర్షానికి ఉన్న ఇల్లు కూలిపోగా, దాతల సాయంతో కట్టిన ఇల్లు డబ్బులు చాలక గోడల వరకే పరిమితమైంది. పైకప్పు నిర్మాణానికి మనసున్న మారాజుల కోసం ఎదురుచూస్తున్నారు ఈ చిన్నారులు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నూతనకంటి రాములు, ఉశమ్మ దంపతులు. వీరికి కూతురు రాజేశ్వరి(11), కుమారుడు శివ(9) ఉ న్నారు. వీరు కూలీ పనులు చేస్తూ బతికేవాళ్లు. ఏడేళ్ల క్రితం రాములు క్యాన్సర్‌తో చనిపోగా ఉశమ్మ ఏడాది క్రితం అనారోగ్యంతో కన్నుమూయడంతో చిన్నారులు ఇద్దరు దిక్కులేనివారయ్యారు. వీరికి అమ్మమ్మ-తాతయ్యలే పోషిస్తున్నారు.
‘మాకెవరు దిక్కు’ శీర్షికన గతంలో ‘నమస్తే తెలంగాణ’ మినీలో ప్రచురితమైన కథనానికి స్పందించిన దాతలు నిత్యావసర సరుకులు, ఆన్లైన్ తరగతుల కోసం మొబైల్ ఫోన్, కొత్త దుస్తు లు, ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల కురిసిన వర్షానికి ఉన్న కాస్త ఇల్లు కూలిపోయింది. దీంతో రాత్రి పూట బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఇంటి సామగ్రిని ప్లాస్టిక్ కవర్లతో చుట్టేసి ఆరుబయట భద్రపరిచారు. గతంలో దాతలు, స్థానికులు సమకూర్చిన డబ్బులతో గోడల వరకు ఇల్లు కట్టుకున్నారు. పైకప్పు నిర్మాణానికి డబ్బులు లేకపోవడంతో పనులను మధ్యలోనే వదిలేసి వర్షంలోనే బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంటి పైకప్పు నిర్మాణం కోసం దాతలు సహకరించి ఆదుకోవాలని ఆ ఇద్దరు చిన్నారులు వేడుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

