విప్లవాన్ని అణచివేసేందుకే ఆపరేషన్ కగార్
విప్లవాన్ని అణచివేసేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ ‘కగార్'ను చేపట్టాయని, ఇటీవల జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ బూటకపు ఎన్కౌంటర్లేనని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు(బీకే-ఏఎస్ఆర్) డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరుతో గురువారం ఓ లేఖను విడుదల చేశారు.
- అవన్నీ బూటకపు ఎన్కౌంటర్లే
- మావోయిస్టు నేత ఆజాద్ పేరుతో లేఖ విడుదల
కొత్తగూడెం క్రైం, మే 16: విప్లవాన్ని అణచివేసేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ ‘కగార్’ను చేపట్టాయని, ఇటీవల జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ బూటకపు ఎన్కౌంటర్లేనని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు(బీకే-ఏఎస్ఆర్) డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరుతో గురువారం ఓ లేఖను విడుదల చేశారు. ఇందులో భాగంగానే గ్రామాలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు చేస్తూ బూటకపు ఎన్కౌంటర్లను నిజమైన ఎన్కౌంటర్లుగా చిత్రీకరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.
మూడున్నర నెలల కాలంలో భద్రతా బలగాలు 103 మందిని పొట్టనబెట్టుకున్నాయని, వారిలో 60 మంది ఆదివాసీ మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నట్టు పేర్కొ న్నారు. 2024 చివరి నాటికి మావోయిస్టు పార్టీని మ ట్టుబెడతామని హోం మంత్రి అమిత్ షా కొన్ని నెలల క్రితమే ప్రతినబూనారని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా దేశాన్ని శాసిస్తూ.. కోర్టులు, జైళ్లు, సెబీ వంటి సంస్థలు, ఉపా వంటి చట్టాలను తీసుకొచ్చి హక్కుల కోసం ఉద్యమించే ప్రజలను, విప్లవోద్యమ పోరాటాలను అణచివేస్తున్నదని లేఖలో పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

