Osmania University | హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల వన్ టైం చాన్స్ పరీక్షా ఫీజు స్వీకరణ
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పూర్తి చేసి బ్యాక్లాగ్ సబ్జెక్టులు మిగిలిపోయిన వారికి వన్ టైమ్ చాన్స్ కల్పించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పూర్తి చేసి బ్యాక్లాగ్ సబ్జెక్టులు మిగిలిపోయిన వారికి వన్ టైమ్ చాన్స్ కల్పించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఓయూ అకాడమిక్ సెనేట్ స్టాండింగ్ కమిటీ అనుమతించిందని చెప్పారు. 2000 సంవత్సరం తరువాత ఆయా కోర్సుల్లో చేరినవారు సైతం తమ బ్యాక్ లాగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు అవకాశమిచ్చామన్నారు. ఈ కోర్సుల అన్ని సెమిస్టర్ల పరీక్షా ఫీజును వచ్చే నెల 14వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. అన్ని కోర్సుల పరీక్షలకు సాధారణ పరీక్షా ఫీజుతో పాటు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సిలబస్, పరీక్షా విధానంలోనే వారు పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పరీక్షలను ఆగస్టు నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

