పోలీసుల డేటా చోరీకి పాల్పడిన కేసులో హ్యాకర్ అరెస్టు : డీజీపీ రవిగుప్తా
తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించిన Hawk Eye , TSCOP యాప్‌లు, ఎస్ఎంఎస్ సర్వీస్ పోర్టల్ నుంచి డేటాను దొంగిలించిన హ్యాకర్‌ను అరెస్టు చేశారు. పోలీసుల డేటా దొంగిలించి 150 డాలర్లకు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినట్లు గుర్తించిన TGCSB అధికారులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ పోలీసు డిపార్ట్మెంట్కు సంబంధించిన Hawk Eye , TSCOP యాప్‌లు, ఎస్ఎంఎస్ సర్వీస్ పోర్టల్ నుంచి డేటాను దొంగిలించిన హ్యాకర్‌ను అరెస్టు చేశారు. పోలీసుల డేటా దొంగిలించి 150 డాలర్లకు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినట్లు గుర్తించిన TGCSB అధికారులు కేసు నమోదు చేశారు. అధునాతన సాధనాలను ఉపయోగించి, హ్యాకర్‌ను గుర్తించామని డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. అరెస్టయిన హ్యాకర్‌కు సైబర్ నేరాల చరిత్ర ఉందని.. గతంలో ఇలాంటి హ్యాకింగ్ కేసుల్లో ప్రమేయం ఉందని తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తుల గురించి కూడా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
ఏ వినియోగదారుడికి సంబంధించిన సున్నితమైన, ఆర్థిక డేటా లీక్ కాలేదని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. Hawkeye మొబైల్ అప్లికేషన్ డేటా రిపోజిటరీలో భాగంగా మొబైల్ నంబర్లు, చిరునామాలు, ఈమెయిల్ ఐడీల వంటి వినియోగదారుల సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుందని తెలిపారు. బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా హాక్ ఐ డేటాలోని నిర్దిష్ట విభాగాల్లోకి హ్యాకర్లు యాక్సెస్ పొంది ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

