Viral Video | కొత్తూరు వై జంక్షన్లో డీసీఎం.. రెండు లారీలు ఢీ.. బైకర్ మృతి.. వీడియో
లారీ డ్రైవర్ నిర్లక్షానికి నిండు ప్రాణం బలైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్ వద్ద ఓ డీసీఎం యూటర్న్ తీసుకుంటున్నది. అదే సమయంలో పైపుల లోడుతో వస్తున్న కంటైనర్ డ్రైవర్ దగ్గరికి వచ్చిన తర్వాత దానిని గమనించాడు. వెంటనే కుడివైపు లారీని తిప్పాడు.
రంగారెడ్డి: లారీ డ్రైవర్ నిర్లక్షానికి నిండు ప్రాణం బలైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్ వద్ద ఓ డీసీఎం యూటర్న్ తీసుకుంటున్నది. అదే సమయంలో పైపుల లోడుతో వస్తున్న కంటైనర్ డ్రైవర్ దగ్గరికి వచ్చిన తర్వాత దానిని గమనించాడు. వెంటనే కుడివైపు లారీని తిప్పాడు. దీంతో డీసీఎంను ఢీకొట్టుకుంటూ రోడ్డుకు అవతలివైపు వెళ్లిన కంటైనర్.. కాటన్ లోడుతోవెళ్తున్న లారీని ఢీకొట్టింది. అదే వైపు నుంచి స్కూటీ వైళ్తున్న అంజయ్యపై లారీ పడిపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్కూటీ వెనక సీట్లో కూర్చున్న మరో వ్యక్తి తీవ్రగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటన శుక్రవారం మధ్యాహ్నం 2.14 గంటలకు జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్నది.

అసలు ఏం జరిగిందంటే..
స్క్రాప్ డీసీఎం కొత్తూరు టౌన్ నుంచి, వై జంక్షన్ వద్ద హైవేపై యూటర్న్ అవుతుంది. అదే సమయంలో కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు పైపుల లారీ కంటైనర్ ను డ్రైవర్ ప్రహాల్లాద అతివేగంగా నడుపుకుంటూ వచ్చి కుడివైపు టర్న్ చేస్తూ స్క్రాప్ డీసీఎంను ఢీ కొట్టుకుంటూ హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు వెళుతున్న కాటన్ దిమ్మెల లారీని కూడా ఢీకొట్టాడు. లారీ ఎడమవైపు పల్టీ కొట్టింది. అదే వైపు నుంచి స్కూటీ నడుపుకుంటూ వెళ్తున్న పెంజర్ల గ్రామానికి చెందిన కందివనం అంజయ్య పై పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. స్కూటీ వెనుక ఉన్న దినేష్‌కు గాయాలు అయ్యాయి. అలాగే కంటైనర్ డ్రైవర్ ప్రహాల్లాద కూడా గాయపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కొత్తూరు సీఐ నరసింహారావు తెలిపారు.
కొత్తూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బైకర్ pic.twitter.com/cXO5pxR1ni
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

