విక్టోరియాలో విచారణ
సీఎంవో ఆదేశాలతో విక్టోరియా మెమోరియల్ హోం రెసిడెన్షియల్ స్కూల్ సూపరింటెండెంట్‌పై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సోషల్వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏడీ ఉమాదేవి, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీడీ, హోం హనరరీ సెక్రటరీ కిషన్ బృందం మంగళవారం ఉదయమే హోమ్‌కు చేరుకున్నది.
- దాదాపు 6గంటల పాటు ఎంక్వయిరీ
- రికార్డులు తీసుకెళ్లిన అధికారులు!
హైదరాబాద్, మే7 (నమస్తే తెలంగాణ): సీఎంవో ఆదేశాలతో విక్టోరియా మెమోరియల్ హోం రెసిడెన్షియల్ స్కూల్ సూపరింటెండెంట్‌పై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సోషల్వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏడీ ఉమాదేవి, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీడీ, హోం హనరరీ సెక్రటరీ కిషన్ బృందం మంగళవారం ఉదయమే హోమ్‌కు చేరుకున్నది. సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతి, పూర్వ స్టోర్‌కీపర్, ప్రిన్సిపాల్, ఇతర సిబ్బందిని అధికారుల బృందం విచారించింది. అనుమతుల్లేకుండా విదేశాలకు వెళ్లడం, విద్యార్హతలు తదితర అంశాలపై లోతుగా విచారించినట్లు సమాచారం.
రాజమండ్రి వెళ్తున్నట్లుగా లీవ్ తీసుకున్న తేదీల్లో దుబాయ్ వెళ్లినట్టుగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. సూపరింటెండెంట్ పాస్‌పోర్ట్, విద్యార్హతలు, ప్రమోషన్లకు సంబంధించిన పత్రాలన్నింటనీ వెంట తీసుకెళ్లినట్టు సమాచారం. హోమ్‌లోని లాకర్‌ను తెరిచి అందులో వస్తువులను పరిశీలించినట్లు తెలిసింది. రూమ్‌లో పలు వెండి ఆభరణలను గుర్తించినట్టు సమాచారం. మరో రెండు లాకర్లు ఉండగా, వాటి తాళాలు లేవని హోం సిబ్బంది బదులివ్వడంతో త్వరలోనే పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటిని తెరిచి పంచనామా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharmistha Mukherjee: ప్రణబ్ ముఖర్జీపై సోనియా కామెంట్స్.. కౌంటర్ ఇచ్చిన శర్మిష్ట ముఖర్జీ
‘బుడ్డగూడెం’ కేంద్రంగా అక్రమ ఇసుక రవాణా
Drinking Water | నిజామాబాద్ శివారులో తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు.. వీడియో
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు రూ.1,800 కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

