సున్నపురాతి గుహగా అర్జున్ లొద్ది
- పాత రాతియుగం నాటి ఆనవాళ్లు
- ఆసిఫాబాద్ అడవుల్లో గుర్తింపు

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండ లం మెస్రంగూడ పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాం తంలో గిరిజనుల ఆధ్యాత్మిక స్థలంగా పేరొందిన అర్జున్లొద్ది గుహ ఆదిమానవుల కాలం నాటి సున్నపు రాతిగుహగా అటవీశాఖ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. ఈ సున్నపు రాతి గుహ సహజసిద్ధంగా ఏర్పడినట్టు వారు గుర్తించారు. గోండు, పర్ధాన్ తెగలకు చెందిన గిరిజనులకు అర్జున్ పేన్ (అర్జునుడు)ను దైవంగా ఆరాధిస్త్తారు. గుహలో ఈ శిల ఉన్నందున ఈ ప్రాంతాన్ని అర్జున్లొద్ది అంటున్నారు. గిన్నేధరి రేంజ్ అధికారి ప్రణయ్ చొరవతో జిల్లా అటవీ అధికారి శాం తారాం ప్రోత్సాహంతో ఈ సున్నపు రాతి గుహ వెలుగులోకి వచ్చింది. ఆదివాసీలకు సుపరిచితమైన ఈ గుహ ఇప్పటివరకు శాస్త్రీయ పరిశోధనకు నోచుకోలే దు. ఈ ప్రాంతంలో పాత రాతి యుగపు మానవ సం చారానికి సంబంధించిన ఆనవాళ్లు, రాతి పరికరాలు కనిపిస్తాయి. పక్కనే జలధార ఉండటం వల్ల పాతరాతి యుగం మానవులు ఇక్కడ ఆవాసాలుగా చేసుకొని ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

