ఈజీగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్

- ఇక టీఎస్‌బీపాస్ ద్వారా మంజూరు
- ఇంటి నిర్మాణ అనుమతుల సరళీకరణ
- కొత్త లేఅవుట్లు, వాణిజ్య భవనాలకు
- ఇందులోనే అనుమతులు జారీ
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి ఆన్లైన్లో అనుమతులిచ్చేందుకు ఏర్పాటుచేసిన టీఎస్‌బీపాస్‌లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. వాణిజ్య భవనాలు, కొత్త లేఅవుట్లకు టీఎస్‌బీపాస్ ద్వారా అనుమతులు మంజూరు చేసేందుకు వీలు కల్పించింది. ఇకనుంచి ఓసీ కోసం కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంటి నిర్మాణం పూర్తి చేసిన యజమానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) టీఎస్‌బీపాస్ ద్వారానే మంజూరు చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే అత్యంత సులువుగా ఓసీ వచ్చేలా మార్పులు తెచ్చారు. 600 గజాలలోపు ఇండ్లకు ఈ విధానంలో ఓసీ ఇస్తున్నారు. డీపీఎంఎస్ విధానంలో అనుమతి పొంది, ఇల్లు కట్టుకున్నవారికి, టీఎస్‌బీపాస్ ద్వారా అనుమతి పొంది ఇల్లు కట్టుకున్నవారికి టీఎస్బీపాస్లోనే ఓసీ ఇవ్వనున్నారు. ఇదివరకే ఇల్లు నిర్మించుకున్నవారు అదనపు అంతస్తుల కొరకు టీఎస్‌బీపాస్‌లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. లేఅవుట్లకు టీఎస్‌బీపాస్ ద్వారా అనుమతి ఇచ్చే విధానాన్ని తీసుకువచ్చినప్పటికీ డీపీఎంస్ విధానంలోనూ అనుమతులను కొనసాగిస్తారు.
25 వేల అనుమతులు
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్‌బీపాస్) అమల్లోకి వచ్చాక 2020 నవంబర్ నుంచి ఇప్పటివరకు 25,196 ఇండ్లకు అనుమతులు మంజూరుచేశారు. వీటిలో డీటీసీపీ పరిధిలో 13,292, హెచ్ఎండీఏ పరిధిలో 9,681, జీహెచ్ఎంసీ పరిధిలో 2,223 ఇండ్లకు అనుమతులు లభించా యి. 75 గజాల నుంచి 600 గజాల వరకు అత్యధికంగా 19,985 అనుమతులు ఇ చ్చారు. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 4,406, రంగారెడ్డిలో 3,842, తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో 1,222, సంగారెడ్డి జిల్లాలో 1100 ఇండ్ల అనుమతులు మంజూరయ్యాయి.
సమస్యల పరిష్కారానికి సులువైన విధానాలు
ఇండ్ల అనుమతులకు దరఖాస్తు చేసుకునే యజమానుల సందేహాలు నివృత్తి చేయడానికి టీఎస్‌బీపాస్‌లో పలురకాల సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఏదైనా సమస్య ఉంటే టీఎస్‌బీపాస్ వెబ్సైట్లో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో చాట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఆన్లైన్లోనే వారి సమస్యలకు సమాధానాలు ఇస్తారు. దళారులను ఆశ్రయించకుండా.. ఇంటి నిర్మాణానికి ఎలా దరఖాస్తు చేయాలో ఉదాహరణలతో సహా తెలిపే వీడియోలను వెబ్సైట్లో పొందుపర్చారు. వెబ్సైట్లో టిక్కెట్టు ఓపెన్ చేసి తమ సమస్యలను వివరిస్తే సమాధానాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు.
టీఎస్‌బీపాస్ ద్వారా ఇచ్చిన ఇండ్ల అనుమతుల వివరాలు
నెల సంఖ్య
నవంబర్ 2020 1121
డిసెంబర్ -2020 1941
జనవరి -2021 3277
ఫిబ్రవరి -2021 4218
మార్చి 2021 5393
ఏప్రిల్ 2021 4871
మే -2021 3126
జూన్ 15 వరకు 1249
మొత్తం 25196
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

