Telangana | 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
Telangana | తెలంగాణలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 2వ తేదీ నుంచి జులై 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. డీపీహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ/ డీఎంఈ విభాగంలో 431 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మల్టీ జోన్ -1లో 270, మల్టీజోన్-2లో 161 పోస్టులు ఉన్నాయి. ఐపీఎం విభాగంలో 4 పోస్టులు ఉండగా, మల్టీజోన్-1లో 1, మల్టీజోన్-2లో 3 పోస్టులు ఉన్నాయి. జులై 2వ తేదీ నుంచి జులై 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. తదితర వివరాల కోసం https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
డీపీహెచ్ అండ్ ఎఫ్డబ్ల్యూ /డీఎంఈ విభాగంలోని పోస్టులకు ఎంబీబీఎస్ తప్పక చదివి ఉండాలి. ఐపీఎం విభాగంలోని పోస్టులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోని ఉండాలి. వీరే సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు రూ. 500 చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసే సమయంలో ఆధార్ కార్డు, టెన్త్ మెమో(పుట్టిన తేదీ ధృవీకరణ కోసం), ఎంబీబీఎస్ కన్సాలిడేటేడ్ మార్క్స్ మెమో, ఎంబీబీఎస్ సర్టిఫికెట్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, 1 నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికెట్స్, కుల ధృవీకరణ పత్రం, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉంచుకోవాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

